మనసు చల్లగ సేద తీరును!
కర్మవీరులు ధర్మ వీరులు - పరుల బాధ్యత మోయు వారలు –
గ్రామ హితముకు నిలుచు ధీరులు - త్రిశుద్ధిగ జీవించు ధన్యులు
కంచు కాగడ పెట్టి వెదకిన కానుపించని త్యాగమూర్తులు
చల్లపల్లిలొ చూడవచ్చును - మనసు చల్లగ సేద తీరును!