ప్రజల మధ్యన పనికి దిగితే
ఉన్న దొక్కటే పుట్టినూరు – కన్న ఋణమును తీర్చమన్నది
ఎందరెందరి త్యాగ ఫలమో – సమాజము ఈ మాత్రమున్నది
దూర దూరం నిలిచి చూస్తే భారమెంతని భయం వేస్తది!
ప్రజల మధ్యన పనికి దిగితే బాట మంచిగ కానుపిస్తది.