15.01.2025....           15-Jan-2025

   మా వీధి సంక్రాంతి శోభ!

చల్లపల్లి జనులందున సౌందర్యపిపాస పెరిగి

గంగులపాలెం బాటన పండుగ సందడి హెచ్చెను

ఇరుగుపొరుగు ఊళ్ళ వాళ్ళ సెల్ఫీలీ వీధిలోన

విడివిడిగా, గ్రూపులుగా వందల ప్రజలిచ్చోటికి!

 

అసలెవ్వరిదీ ఆలోచన? ఏ సద్భావన పునాది?

ఎవరి దింత ధన వ్యయము? ఎవ్వరి శ్రమ దీని వెనుక?

నరకంగా పేరొందిన అప్పటి రహదారా ఇది?

మానవ శ్రమ సాధించిన మంచికి తార్కాణం ఇది!