21.07.2025....           21-Jul-2025

 చల్లపల్లిలో వృక్ష విలాపం – 7

(చల్లపల్లి వృక్ష సంపద తరపున దాసరి వారి వేదనకు నల్లూరి వారి పద్య రూపం)

దశాబ్దంగా స్వచ్ఛ సుందర ఉద్యమం వికసించుచుంటే

కార్యకర్తల చెమట చలువతొ చెట్లు ముప్పది వేలుపైగా

ఊరి అందం పెంచుచుంటే - ఉష్ణమును చల్లార్చుచుంటే -

చూడ జాలని మూర్ఖజీవుల చుప్పనాతితనం కదా ఇది?

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   లాస్ ఏంజల్స్ - USA

   21.07.2025