శ్రమైక జీవన సౌందర్యాలను ...
శ్రమైక జీవన సౌందర్యాలను – చాటి చెప్పుటకు ఉందిగా
స్వచ్ఛ సంస్కృతుల నిలువుటద్దమై – చల్లపల్లి మిగిలిందిగా ॥ శ్రమైక జీవన ॥
సుమ సుందర ఉద్యాన పరిమళం – శుభ సందేశము పంపగా
పర్యాటకులకు చల్లపల్లి ఒక – స్వర్గధామమైపోయెగా ॥ శ్రమైక జీవన ॥
స్వచ్ఛ సైనికుల – ట్రస్టు కార్మికుల – చెమట బిందువుల సాక్షిగా
శ్మశానాలు, రహదారులు, వీధులు – స్వచ్ఛ సుందరము లాయెగా ॥ శ్రమైక జీవన ॥
ప్రతి గ్రామంలో చల్లపల్లి వలె - స్వచ్ఛ – స్వస్తతలు నిండగా
సమస్త దేశం ఆరోగ్యం – ఆనంద తాండవము చేయదా?
శ్రమైక జీవన సౌందర్యాలను – చాటి చెప్పుటకు ఉందిగా
స్వచ్ఛ సంస్కృతుల నిలువుటద్ధమై – చల్లపల్లి ప్రభవించెగా ॥ శ్రమైక జీవన ॥