ఇట్టి వాళ్ళకె నా ప్రణామం – 15
ఎవరు మెచ్చిన – ఎవరు నొచ్చిన – విమర్శలతో విజృంభించిన –
ప్రశంసలతో ఊపి వదిలిన – స్వచ్ఛ – శుభ్ర ప్రయత్నమందే
సుస్థిరంగా ప్రయాణించే – లక్ష్య సాధనలోన మునిగే -
చరితపుటలో నిలిచిపోయే సాహసికులకు మా ప్రణామం!