సమర్పిస్తున్నాం ప్రణామం – 62
ఎవరి ఎడదలు స్వార్థమున కొక్కింత దవ్వున నిలుస్తున్నవొ
ఎవరి చేష్టలు పొరుగు వారి కొకింత సాంత్వన ఇచ్చుచున్నవొ -
ఏ వినూత్న స్వచ్ఛ ఉద్యమ మింత ఊరి ప్రమోదకరమో –
అట్టి ఉద్యమ కర్తలకె మే మందజేస్తుంటాం ప్రణామం!