ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడం!
స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం –1949* వ నాటి కొన్ని ఉద్వేగ క్షణాలు.
- శివరామపురం మార్గంలో ఇరువైపుల మళ్లీ వందల కొద్దీ ఖాళీ మద్యం సీసాలు, పెద్ద ట్రక్కు నిండ రకరకాల గడ్డి-గాదం- కొమ్మ-రెమ్మలు, మొలకెత్తిన తాడి కాయలు వంటి వన్నీ తొలగి, పని జరిగిన మేర శుభ్రంగా- జరగవలసినది భిన్నంగా కనిపిస్తున్నవి.
- సుందరీకర్తల చేతిలో కమ్యూనిస్టు వీధి ప్రహరీ గోడలు,(కొండొకచో ఇళ్ల గోడలు కూడా!) రంగులు వులుముకొని, అందమైన బొమ్మలు ప్రత్యక్షమై చూపరుల నయన మనోహరాలైపోతున్నవి.
- ఒక పెద్ద ట్రక్కు నుండి ఒలికిన కాంక్రీటు మిశ్రమాన్ని కష్టపడి సేకరించి, బైపాస్ దారిలోను, సంత వీధిలోను గుంటలను పూడ్చిన గ్రామ రక్షక దళాన్ని చాలామంది గమనించారు గాని, సముచిత స్పందనలు మాత్రం లేవు!
- వేకువ సమయంలోనే గ్రామంలో కార్యకర్తలు నాటి, సాకి, పెంచిన వేలాది చెట్లకు ట్రస్టు ఉద్యోగ మిత్రులు జలధారలందిస్తున్నారు!
6.40 సమయంలో స్వచ్చ వేడుక ముగింపు కాలంలో జరిగిన శ్రమ దాన సమీక్ష – ప్రశంసా సమావేశంలో:
రేపటి శ్రమదాన ఉదంతం కూడ పెదకళ్లేపల్లి దారిలోనే!
ఆ విజయ రహస్యం ఇది.
స్వచ్చ-శుభ్ర చల్లపల్లి విజయ రహస్యంబేదన....
సామాజిక ఋణం తీర్చు సద్భావనతో కొందరు...
దాతల సౌజన్యంతో మరు భూములు, కాల్వ గట్లు
మనోహరాకృతులు తీర్చి మైమరపించేయడం
నల్లూరి రామారావు
స్వచ్చ చల్లపల్లి కార్యకర్త,
సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,
శుక్రవారం – 13/03/2020
చల్లపల్లి.