పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడదగునా!
మళ్లీ రంగంలోకి రెస్క్యూ టీమ్ - @3125*
సోమవారం - 20.5.2014 వేకువ శ్రమదాన సమాచారం ప్రకారం - 4.20 సమయంలోనే 5 గురు గస్తీగది వీధిలోనికి వచ్చారు. వాళ్ల కందిన సమాచారాన్ని బట్టి NH 216 మీద - బందరు నుండి 22 వ కిలోమీటరు రాయి దగ్గర – గంగులవారిపాలెం వైపు వరిగడ్డి సగం కాలి, మిగిలింది చెల్లా చెదురుగా పడి ఉందని గ్రహించారు.
వెనువెంటనే కిలోమీటరు దూరంగా ఉన్న ఆ చోటికి వెళ్లి వాలారు. అక్కడి దృశ్యం అందమైన జాతీయ రహదారికేమాత్రం తగినట్లుగా లేదు. రోడ్డువారన – దక్షిణపు మార్జిన్ భీభత్స రసాత్మకంగా ఉన్నది. అందుకే గంటన్నరకు పైగా వారు చేసిన దిద్దుబాటు పనులు కొంతవరకు ఫలించాయి.
శంకర శాస్త్రి గారి ఛాయాచిత్రాల్ని ఒకసారి చూడండి : ఒక వంక సంవత్సరన్నర నుండీ స్వచ్ఛ కార్యకర్తలు నాటి - పెంచితే ఇప్పుడు పూలకొమ్మల్తో అందమైన దృశ్యాలూ, మరో ప్రక్క ఆ సౌందర్యాన్ని దెబ్బ తీస్తున్న కాలీకాలని వరిగడ్డి పరకలు! వాటి మధ్యనే – ఆ అస్తవ్యస్తతల్ని సరిదిద్దాలని శ్రమిస్తున్న కార్యకర్తలు!
6.00 దాక శ్రమించిన రెస్క్యూ బృందం ఇక ఈ వేళకు పని విరమించి, పద్మాభిరామం వద్ద – మనకోసం మనం ట్రస్టు పర్యవేక్షక హోదా కల కస్తూరి శ్రీనివాస ప్రకటిత త్రివిధ స్వచ్ఛోద్యమ నినాదాలకు స్పందించి, ఇళ్ళకేగింది!
అంకితులు మన చల్లపల్లికి – 98
సరసోక్తుల - చతురోక్తుల దాసి సీతారామరాజు
పంచాయతి పనుల్లోన తలమునకగ ఉండి కూడ
ఏళ్లకేళ్లు శ్రమదానం ఎట్లు చేయగలిగాడో –
ఊరి పట్ల మమత తోడ - ఉధృత సంకల్పం తోడ!
- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
20.05.2024