3211* వ రోజు .......           22-Aug-2024

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం?

ఈ 3211* వ నాటి  శ్రమ వేడుక!

          ఇది శ్రావణ గురువాసర - 22 మందికి చెందిన స్వచ్చ కార్యకర్తల శ్రమ సౌభాగ్యం! గంగులవారిపాలెం సమీపంలో జాతీయ రహదారి ప్రక్కన వెల్లివెరిసిన శ్రమ కార్యకలాపం.       

          ఇంకా - చెప్పాలంటే డా. డి.ఆర్.కె, ప్రాతూరి శంకర శాస్త్రి గారల ఛాయాచిత్రాల సమీకరణం.

          ఎందుకిలా వేల రోజుల తరబడి శ్రమిస్తుంటారో - అది జగద్విదతం. చేసే కార్యకర్తలకు విసుగూ లేదు. అది చూసే మా ఇద్దరికీ విరామము లేదు.

          అసలు విషయానికొస్తే నేటి శ్రమ సౌభాగ్యం సార్ధకం, సముచితం, సదసద్వివేకం!

          ఐతే నేను చెప్పినంత తేలిక కాదు - కత్తులతో, దంతెలతో, గొర్రులతో జరిగిన కఠిన శ్రమ!

          ఎంతో ఓపిక తెచ్చుకుని అన్నీ సమన్వయించుకొని ఏ చిన్న విషయమూ వదలకుండా 22 మంది తలా గంటన్నర శ్రమను వర్ణించడమంటే మాటలా? చూడుడు - మహిళా - పురుష కార్యకర్తలు ఎగబడి చేస్తున్న శ్రమదానాన్ని;

          ఇంకా తెలతెలవారే కొద్దీ ప్రతి ఒక్కరూ నేటి పని లక్ష్యాన్ని చేరుకొనేందుకు పడే తాపత్రయమూ అది చూస్తూ DRK గారి ఆశ్చర్యమూ!

అయ్యా,

          స్వచ్చ సుందరోద్యమ నేటి లీలలు ఇవే. కార్యకర్తలందరికీ వందనాలు.

          నేటి నినాదాలను ప్రకటించిన వారు కస్తూరి విజయ నామధేయుడే!

          రేపటి మన శ్రమ సంతర్పణ కూడా గంగులవారిపాలెం దగ్గరి జాతీయ రహదారే! 

          డి.ఆర్.కె గారి మిత్రుడు - 1974 బ్యాచ్ కు చెందిన గుంటూరు మెడికల్ కాలేజి పూర్వ విద్యార్ధి - గుంటూరు వాస్తవ్యుడైన డా. కె. ప్రసన్న కుమార్ గారు తన పెళ్లి రోజు సందర్భంగామనకోసం మనంట్రస్టుకు 10,000/- విరాళాన్ని ఆన్లైన్ లో పంపినందుకు ధన్యవాదాలు.        

          అమెరికా ప్రవాసి నల్లూరి సూర్యవర్ధన్ తన స్వగ్రామం అభివృద్ధి కోసం మనకోసం మనంట్రస్టుకు 50,000/- చెక్కు రూపంలో మేనేజింగ్ ట్రస్టీ డి.ఆర్.కె. ప్రసాదు గారికి అందజేశారు.     

          స్వచ్చ కార్యకర్త పాగోలు దుర్గా ప్రసాద్ వారి కుమార్తె ఓణీల వేడుక సందర్భంగా స్వచ్చ చల్లపల్లి అభివృద్ధి కోసం 2,000/- విరాళం ఇచ్చారు. 

          ఊగిసలాట అవసరమా!   

జనహిత శ్రమదానానికి చాలీ చాలని స్పందన

క్రొత్త శ్రమ సంస్కృతి యెడ కొంచెం మిశ్రమ స్పందన

స్వచ్చోద్యమ కారులపై సగం సగం నమ్మకమా!

ఉత్తమ కార్యాచరణకు ఊగిసలాట అవసరమా!   

- ఒక తలపండిన కార్యకర్త

        22.08.2024