1987*వ రోజు....           20-Apr-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడవద్దు. 

 స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం 1987* వ నాటి శ్రమ - సమయదానాలు 

          1987* వ నాటి స్వచ్చ సైనికుల గ్రామ శుభ్ర – సుందరీకరణ ప్రయత్నం ఈ వేకువ 4.00 కే మొదలైంది. 36 మంది పాల్గొన్న ఈ స్వచ్చంద శ్రమదానం 6.106.40 వరకూ పొడిగింపుగా సాగింది. వివరించాలంటే – ఇది చల్లపల్లి లో 4 చోట్ల – 3 విధాలుగా పనికి వచ్చింది!

- విజయవాడ బాటలోని శ్రీమంతుల క్లబ్బు – దివంగత కస్తూరి మామ్మ గారి మినీ రహదారి వనం పరిసరాలలో 20 మందికి పైగా కార్యకర్తల 2 గంటల కృషి చోటుచేసుకున్నది. అందరూ సమిష్టిగా నిర్వహించిన ఈ 40 పని గంటల గ్రామ బాధ్యతలలో వీళ్ళు చేయనిదేమున్నది! చీపుళ్లతో రోడ్ల ఊడ్పుమనకోసం మనం ట్రస్టు వారు పరచిన (పేవర్ టైల్స్) రంగు రాళ్ళ పరిశుభ్రతకంచె లోపలి మొక్కల సవరణలుకనపడని గడ్డి – పిచ్చి మొక్కల పీకివేతలుకాలుష్యకారక సమస్త వ్యర్ధాల ఏరివేతలుట్రాక్టర్ లో ఆ ప్రోగులు నింపుకొని ఆ డంపింగ్ కేంద్రానికి చేరవేతలు – ఇలా సుదీర్ఘ కాలంగా నిస్వార్ధంగా స్వగ్రామ బాధ్యతలలో లీనమై ఆనందించే ఈ కరుడు గట్టిన స్వచ్చోద్యమ కారులకు నా అభినందనలు!

- రెస్క్యూ టీం వాళ్ళు ఎప్పుడు – ఏ కష్టమైన పనికి వెనుకాడారుబికనీర్ హోటల్ పరిసరాల్లోఐరన్ షాపు దగ్గర వీళ్ళ శ్రమకూకార్చిన చెమటకూ ఈ పొడి మాటలతో వెలకట్టగలనా! నేటి ఒక విశేషమేమిటంటే – నాదెళ్ళ యోగ వేంకటేశ్వరరావు తన షాపు దగ్గర స్వచ్చ కార్యకర్తలు చేస్తున్న మట్టి  పనిని గమనించి తన ఉద్యోగులను కూడా కలిపి పని పూర్తి చేయడం! ఈ నాదెళ్ళ వేంకటేశ్వరుడి’ స్ఫూర్తి అన్ని షాపుల వారికీఅందరు గృహస్తులకూ – కరోనా స్ధాయిలో  వ్యాపించాలని కోరుకొందాం!

- వీళ్ళు కాక ఆరుగురు కార్యకర్తలు 6 వ నెంబరు పంట కాల్వ పడమటి భాగాన్నిగట్లను శుభ్రంగా తీర్చి దిద్దారు. 

- సుందరీకరణ కళాకారులు అమరావతి రాజుల వైజయంతం” ప్రహరీని రంగుల పూల తీగలతోనూరాచరికపు కళాత్మక బొమ్మంచులతోను నింపుతూనే ఉన్నారు. ఒక్కసారి ఆ గోడ యజమాని అనుమతినిచ్చాక వీళ్ళు నిరంకుశులే మరి!

          వీళ్ళ కళాతృష్ణస్వచ్చ సైనికుల పరిశుభ్రతా తపన, ‘మనకోసం మనం’ ట్రస్టు చిరంతన చింతన గ్రామస్తులందరికీ తొందరలోనే  అంటుకొనుగాక!

          33 ఏళ్ళ ఉస్మాన్ షరీఫ్ అనే కార్యకర్త తన జన్మదిన సందర్భంగా సమర్పించిన 200/- కు కృతజ్ఞతలు!

          రేపటి మన శ్రమదాన బాధ్యతలు బందరు రహదారిలో - అమరావతి జమీందారు గారి వైజయంతం వద్ద చూసుకొందాం.

 

            వివరంగా ప్రకటిస్తా

గ్రామం ప్రతి మూల మూల ప్రతి బాధ్యత స్వీకరించి

దారు లూడ్చి – మురుగులెత్తి – దర్శనీయములుగ మార్చి

వినోదాలు – విజ్ఞానం విహరింపగ చేసి చూపి

స్వచ్చోద్యమ దీపాలను ప్రజ్వలింపజేశారని.... 

- నల్లూరి రామారావు

స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్తలు

సోమవారం – 20/04/2020

చల్లపల్లి.