3510* వ రోజు .. ....           25-Jun-2025

 ఒకసారి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వినియోగం మనకొద్దు!

పర్యావరణ పరిరక్షణే మనందరి కర్తవ్యమన్నమాట మరవద్దు!

25.06.2025 బుధవారం 3510* వ రోజు పని పాటల ముచ్చట్లు!

         తెల్లవారుజామున 4:17 నిమిషాలకు 13 మందితో స్వచ్ఛ సేవలు ప్రారంభమైనవి. హైవే రోడ్ లోని గంగులవారిపాలెం స్వాగత ద్వారమునకు అతి సమీపంలో సువర్ణ గన్నేరు, మద్రాసు కనకాంబరం మొక్కలకు చుట్టూ ఉన్న కలుపు తీయడం జరిగింది. రోడ్ క్రింది భాగంలో ఉన్న కలుపు మొక్కలను తీసి పరిశుభ్రం చేయడం, ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ గ్లాసులు చెత్తా చెదారాలను ఏరివేసి లోడ్ చెయ్యడం జరిగింది.

         యధాప్రకారం రోడ్ కు ఒక ప్రక్క మార్జిన్ లో గుబురుగా పెరిగిన గడ్డిని మిషన్ తో కట్ చేసి చీపుళ్ళతో ఊడ్చి వేయడం వలన రోడ్ మార్జిన్ ఎంతో అందంగా కనిపిస్తుంది.

         హైవే పై అటుగా కారులో ప్రయాణం చేస్తున్న NRI శ్రీ చలసాని నంద గోపాల్ గారు ఈ స్వచ్ఛ సేవలు చూసి కారు ప్రక్కకు ఆపి వివరాలు తెలుసుకుని కొద్ది సేపు పనిలో పాల్గొని ఆ తరువాత జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొని స్వచ్ఛ చల్లపల్లి సేవలను కొనియాడారు.

         6 గంటలకు విజిల్ మ్రోగగానే పనికి విరామమిచ్చి కొద్దిసేపు కాఫీ సేవించిన పిదప సమీక్షా సమావేశంలో సజ్జా ప్రసాద్ గారు పలికిన “జై స్వచ్ఛ సుందర చల్లపల్లి” నినాదంతో గొంతు కలిపి,

         రేపు ఆగవలసిన ప్రదేశం కూడా ఇదే దారిలో కొంచెం ముందు పని ఆపిన ప్రదేశమని అనుకుని నిష్క్రమించారు.  

- నందేటి శ్రీనివాస్

   ప్రజాకళాకారుడు

  25.06.2025

         ఏమాశ్చర్యం! ఎంత విశేషం! – 7

తన నగలు అమ్మి గ్రామ వీధి సొగసులు పెంచే పని,

ఊరి సమస్యలకు వైద్య ద్వయం చికిత్స చేస్తున్న కృషి,

సామాజిక సంక్షేమం సాధించుట వంటివి

చరిత్రలొ ఎపుడొ గాని సంభవించ విట్టివి!  

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   లాస్ ఏంజల్స్ - USA

    25.06.2025.

చలసాని నంద గోపాల్ గారు