3523* వ రోజు . ....           08-Jul-2025

 ఒకసారి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులను వాడొద్దు!

08.07.2025 మంగళవారం 3523* వ రోజు నాటి శ్రమదాన విశేషాలు!

         వేకువజాము 4:18 నిమిషాలకు 12 మందితో స్వచ్చసేవా కార్యక్రమం హైవే రోడ్డుపై

ప్రారంభించబడింది. రోడ్డు క్రింది భాగంలో కార్యకర్తలు పిచ్చి మొక్కలను తీసి శుభ్రం చేస్తూ పెద్ద మొక్కల పాదులలో ఉన్న కలుపును మొత్తం ఏరివేయడం జరిగింది.

         రహదారి ప్రక్క మార్జిన్ లో ఏపుగా పెరిగిన గడ్డిని మాత్రం కటింగ్ మిషన్ తో కత్తిరించడం, వెనుక చీపుళ్ళతో శుభ్రపరచడం ఈరోజు మాత్రం 23 మంది కార్యకర్తలు వారి శక్తి కొలది శ్రమించి హైవే ను చల్లపల్లి పొడవునా చాలా ప్రత్యేకతగా అనిపించేట్లుగా తయారుచేస్తున్నారు.

         6 గంటల వరకూ నిర్విరామంగా శ్రమించి విజిల్ మ్రోగగానే పనికి విరామమిచ్చి కాఫీ సేవించిన పిదప సమీక్షా సమావేశంలో ఆకుల దుర్గా ప్రసాదు గారు చెప్పిన జై స్వచ్చ సుందర చల్లపల్లి నినాదంతో సాధిస్తాం సాధిస్తాం అంటూ జై కొట్టి,

         రేపు కలవవలసిన ప్రదేశం ఈరోజు పని ముగిసిన ప్రదేశంలోనే అనుకుని నిష్క్రమించారు.

- నందేటి శ్రీనివాస్

   ప్రజాకళాకారుడు

   08.07.2025

          మంకు పట్టు వదలలేదు!

ఉత్సాహం లోపించదు – ఉల్లాసం తరగలేదు

ఎన్ని వేల రోజులైన ఈ పయనం ఆగలేదు

పారిశుద్ధ్య నిర్వహణకు, పచ్చదనం పెంపుదలకు

కంకణధారులు తమ తమ మంకు పట్టు వదలలేదు!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   లాస్ ఏంజల్స్ - USA

    08.07.2025