3525* వ రోజు . ....           10-Jul-2025

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం!

10.07.2025 గురువారం 3525* వ రోజు సుదీర్ఘ శ్రమదాన విశేషం!

          నేటి వేకువ 4:17 నిమిషాలకే జాతీయరహదారిపై ఊరి శుభ్రత కోసం 15 మంది పాల్గొని మొదటి ఫోటో దిగి కార్యకర్తలంతా గ్లౌస్ వేసుకుని ఎవరికి కావలసిన  పనిముట్లు వారు తీసుకుని ఊరి సేవ కోసం పాల్గొన్నారు.

         హైవే లో రోడ్డు మార్జిన్ లో రోడ్డుకు ఎగువ భాగాన, దిగువ భాగాన గత సంవత్సరం 1974 బ్యాచ్ గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్ధులు నాటిన మొక్కల వద్ద పేరుకుపోయిన కలుపు మొక్కలను, పిచ్చి చెట్లను తొలగించి శుభ్రం చేసి గుట్టలుగా పేర్చారు.      

         గడ్డి కోసే మిషన్ తో ఒక కార్యకర్త పిచ్చి గడ్డిని తొలగించడం జరిగింది.

         కొంతమంది కార్యకర్తల బృందం కొత్తగా పెట్టిన మొక్కల వద్ద పాదులు తీసి మట్టిని చెట్టుకు దన్నుగా పోశారు.

         చాలా రోజుల తర్వాత వచ్చిన యువ కార్యకర్తల బృందం, మరికొంతమంది కార్యకర్తలు కలిసి గుట్టలుగా పేర్చిన పిచ్చి గడ్డిని ట్రాక్టర్ లో కి చకచకా లోడింగ్ చేయడం జరిగింది.

         6:10 కి విజిల్ మ్రోగిన వేళకు కార్యకర్తలంతా కాఫీ సేవించిన పిదప సమీక్షా సేవలో పాల్గొని,

         గోళ్ళ వెంకటరత్నం గారు చెప్పిన స్వచ్ఛ నినాదాలకు బదులిచ్చి,

         రేపు కలవవలసిన ప్రదేశం ఈరోజు ఆగిన చోటే అనుకుని నిష్క్రమించారు.

         స్వచ్చ కార్యకర్త కోడూరి వేంకటేశ్వరరావు గారు స్వచ్చోద్యమ ఖర్చుల నిమిత్తం 520/- విరాళం అందజేశారు. 

- దాసరి రామకృష్ణ ప్రసాదు

   10.07.2025

 

         అప్పుడిక నన్నొచ్చి అడుగుము!

గ్రామమునకై స్పచ్ఛ సుందర కార్యకర్తగ మారిచూడుము

సమాజానికి పడిన అప్పును సగం సగమైన తీర్చుము

నాలుగైదేళ్లయే సరికే వ్యసనముగ అది మారకుంటే –

ఆత్మ తృప్తిని ఇవ్వకుంటే అప్పుడిక నన్నొచ్చి అడుగుము!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   లాస్ ఏంజల్స్ - USA

 

    10.07.2025