పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం?
28.07.2025 సోమవారం 3543* వ రోజు నాటి స్వచ్ఛ యజ్ఞం కార్యక్రమాలు!
తెల్లవారుజాము 4.13 నిమిషాలకు 8 మంది కార్యకర్తలతో గంగులవారిపాలెం రోడ్డులో స్వచ్ఛ సేవ మొదలైంది. ఆ రోడ్ లో మురుగు కాలువ వైపు అస్తవ్యస్తంగా కొట్టిపడవేసిన చెట్ల కొమ్మలు, ఎండిన మొదళ్లు, ముళ్ళ పాదులు పెరిగి స్వచ్ఛ కార్యకర్తలు గత సంవత్సరం నాటిన మూమిడి మొక్కలకు అవరోధంగా ఉన్నాయి. వాటిని స్వచ్ఛ కార్యకర్తలు ఒక క్రమపద్ధతిలో నరికి ఎండిన కొమ్మలతో అంచు కట్టి మట్టి జారకుండా మరికొంత మార్జిన్ పెరిగే ప్రయత్నం చేస్తున్నారు.
ఎంతకాలం కార్యకర్తలు చెమటను చిందిస్తే ఆ రోడ్డు ఈరోజు అలా ఉందో ఆ దారిన వెళ్ళే ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే ఒక పనిని చెయ్యడం వేరు, ఆ పని పూర్తి చెయ్యడం కూడా వేరు. కానీ ఒక పని చేసినపుడు దాని లక్ష్య సాధనకై పరితపించడం, అంకితభావంతో బాధ్యతాయుతంగా పని చెయ్యడం దానిని శాశ్వత ప్రయోజనకరంగా చెయ్యడం నిజంగా స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తకే చెల్లు, ఎంత శ్రమిస్తే ఆదారికి అంత మార్జిన్ ఏర్పడి ఈరోడ్డు ఎదురెదురు వాహనాలు సునాయాసంగా తప్పుకొంటున్నవో వేరే చెప్పనవసరం లేదు.
అలస్తీనియా మొదళ్లకు పాకించిన తీగజాతి పూల మొక్కలను సరిచేసి చుట్టుకుంటూ, గద్దగోరు మొక్కలను కత్తిరించుకుంటూ మామిడి మొక్కలకు గాలి వెలుతూరూ అందేట్లుగా వీరు చేసే సంరక్షణా చర్యలు చూస్తుంటే కన్న బిడ్డల పెంపకం కంటే ఎక్కువగా అనిపిస్తుంది.
6 గంటల వరకూ చాలా కష్టంతో కూడిన ఆ పనులను చేస్తూ విజిల్ మ్రోగేసరికి పనికి విరామమిచ్చి అక్కడ రోడ్డుకు దన్నుగా వేసిన తాడి మొద్దులపై కూర్చుని ఒంటి చెమటను ఆరబెట్టుకుంటూ కప్పు కాఫీ సేవిస్తుంటే ఈ సమాజం కోసం శ్రమించే వీళ్ళే నిజమైన దేశభక్తులనిపిస్తుంది.
కాఫీ విరామం అనంతరం శివబాబు గారు పలికిన “జై స్వచ్ఛ సుందర చల్లపల్లి” నినాదానికి జైకొట్టి గురవయ్య మాస్టారు చెప్పిన నీతి సూక్తులను ఆలకించి,
రేపు కలవవలసిన ప్రదేశం ఈదారి మలుపు వద్ద అనుకుని నిష్క్రమించారు.
- నందేటి శ్రీనివాస్
ప్రజా కళాకారుడు
28.07.2025.
వైఖరిని లేర్పరచుచున్నది!
జన్మతః ప్రతి జీవి కూడా కష్టజీవే - అది యదార్థమే –
అతని జీన్సూ, గత చరిత్రా వెతలమయమే – కాయకష్టమె
“అతడి కష్టం కేవలం స్వార్ధానికా - మరి సమాజానికి
అనేదే ఈ కార్యకర్తల వైఖరిని లేర్పరచుచున్నది!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
లాస్ ఏంజల్స్ - USA
28.07.2025