ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం!
27.08.2025 బుధవారం – 3573* వ రోజు నాటి స్వచ్ఛ సేవా కార్యక్రమాలు!
హైవే రోడ్ లోని స్వాగత ద్వారం వద్ద వేకువజాము 4:14 నిమిషాలకు 9 మంది కార్యకర్తలు పమిముట్లు చేతబట్టి కార్యరంగంలో దిగారు. స్వాగత ద్వారం వద్ద నూతనముగా ఏర్పాటు చేసిన బారికేడ్స్ ముందు లాన్ ను సమానంగా పరిచే పనిని మొదలుపెట్టారు.
వర్షపు జల్లు సన్నగా పడుతూ ఉన్న కార్యకర్తలు మాత్రం ఎవరికి వారు పని ప్రదేశానికి చేరుకుని పనిలో భాగస్వాములయ్యారు. స్వాగత ద్వారం ప్రాంగణమంతా అత్యంత సుందరంగా తయారుచేసే పనిలో కొన్ని బిళ్ళ గన్నేరు మొక్కలను నాటడం జరిగింది.
కొందరు కార్యకర్తలు చిన్న, పెద్ద మొక్కల మొదట్లో ఉన్న కలుపును తీసి మొక్కలు పెరగడానికి వీలు కల్పించారు. మరొక కార్యకర్త రోడ్డుకు రెండు ప్రక్కలా మార్జిన్ ను మిషన్ తో కట్ చేయడం జరిగింది. మరొక కార్యకర్త ఆ ప్రాంతంలోని ఎగుడు దిగుడుగా ఉన్న మట్టిని సరిచేశారు.
వర్షంలో తడుస్తూ 6 గంటల వరకూ పని చేస్తూనే విజిల్ మ్రోగగానే పనికి విరామమిచ్చి కాఫీ సేవించిన పిదప సమీక్ష సమావేశంలో నేను పలికిన “జై స్వచ్ఛ సుందర చల్లపల్లి” కి స్వరం కలిపి జై కొట్టి,
రేపు కలవవలసిన ప్రదేశం స్వాగత ద్వారం వద్ద అనుకుని తిరుగు పయనమయ్యారు.
- నందేటి శ్రీనివాస్
ప్రజా కళాకారుడు
27.08.2025.
చల్లపల్లిలో ‘స-రి-గ-మ-ప-ద-ని-స’ – 7
ఆకుల దుర్గాప్రసాదు తదితర ఆణిముత్యముల నిత్యసేవతో
శివరాంపురీయ ప్రేమానంద విశిష్ట సేవలలరించుచుండగా
బి.ఎస్.ఎన్.ఎల్, కస్తూరి సోదరులు వింత వింత పోకడల సేవతో
స్వచ్చోద్యమ సంగీత మధురిమలు చల్లపల్లిలో చెలరేగెనులే!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
27.08.2025.