3578* వ రోజు ....           01-Sep-2025

 ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం!

01.09.2025 సోమవారం 3578* వ రోజు స్వచ్ఛ శ్రమదాన విశేషాలు!

          తెల్లవారుజాము 4.15 ని.లకు బండ్రేవు కోడు వంతెన వద్ద 9 మంది కార్యకర్తలు ఫోటో దిగి పని మొదలుపెట్టారు.

          హైవే రోడ్ కు రెండవ వైపు ఉన్న గద్దగోరు మొక్కలలో కలుపును మొత్తం లాగి శుభ్రం చేస్తూ కొంతదూరం వెళ్లారు. వంతెన ప్రక్కగా ఉన్న మార్జిన్ వద్ద పల్లంలోకి మట్టి జారకుండా ట్రాక్టర్ పై తాటి బొండు తీసుకొచ్చి పేర్చారు.

          ఒక కార్యకర్త మిషన్ చేతబట్టి విసుగూ విరామం లేకుండా దారి పొడవునా మార్జిన్ గడ్డిని కత్తిరిస్తూ హైవే కు అందాలనద్దుతున్నారు. కట్ చేసినప్పుడు రోడ్డు మీద పడిన గడ్డి పొడిని మహిళా కార్యకర్తలు పరిశుభ్రం చేస్తున్నారు.

          6 గంటలు దాటే వరకు పనిచేసిన 23 మంది కార్యకర్తలు విజిల్ మ్రోగగానే పనికి విరామమిచ్చి కాఫీ సేవించిన పిదప పల్నాటి అన్నపూర్ణమ్మ గారు పలికిన జై స్వచ్ఛ సుందర చల్లపల్లి కి జై కొట్టారు.

          స్వచ్చ మహిళా కార్యకర్త దేసు మాధురి గారి కుమార్తె జాహ్నవి పుట్టినరోజు సందర్భంగా స్వచ్ఛ చల్లపల్లి అభివృద్ధికి 1,000/- రూపాయల విరాళం అందించారు.

          చలసాని కాంచనరావు గారి జ్ఞాపకార్ధం వారి కుమార్తె శ్రీలక్ష్మి, అల్లుడు కంఠంనేని నరహరి గార్లు వారి కుమార్తెలు డా.హారిక, నమ్రత గార్లు స్వచ్ఛ చల్లపల్లి అభివృద్ది కోసం “మనకోసం మనం” ట్రస్టుకు 60,000/- రూపాయల చెక్కును డాక్టరు గారికి అందజేశారు. వీరికి స్వచ్ఛ కార్యకర్తలందరి తరపున ధన్యవాదములు.

          రేపు కలవవలసిన ప్రదేశం హైవే లోని శారదా గ్రాండియర్ వద్ద అనుకుని నిష్క్రమించారు.

- నందేటి శ్రీనివాస్

  ప్రజా కళాకారుడు  

  31.08.2025.

        అతడు శంకర శాస్త్రి!

అతని దెపుడూ మందహాసమె - ఆగ్రహం అతి అరుదుగానే!

అతని ఎడదన సంతసములే - అసంతృప్తి సకృత్తుగానే

అతని లక్ష్యం నిద్రలోనూ స్వచ్ఛ సుందర చల్లపల్లే!

అతడె శంకర శాస్త్రి! కానీ - అతని దసలీ ఊరు కాదే!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త