పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం!
3592* వ రోజు - ది.15.09.2025 సోమవారం నాటి స్వచ్ఛ సంగతులు!
నేటి వేకువ జాతీయ రహదారి ప్రక్కన ఉన్న ‘శారదా గ్రాండియర్’ వద్ద తెల్లవారుజాము 4:15 నిమిషాలకు 9 మంది కార్యకర్తలతో శ్రమదాన కార్యక్రమం ప్రారంభమయింది.
హైవేకు కుడి ప్రక్క (అవనిగడ్డ) వైపు టెకోమారెడ్ మొక్కల పాదుల చుట్టూ ఉన్న కలుపు, గడ్డిని జాగ్రత్తగా తీసి శుభ్రపరిచారు.
అలాగే క్రింది భాగంలో పెట్టిన నీడనిచ్చు మొక్కలకు, పండ్ల మొక్కల చుట్టూ కూడా ఉన్న రెల్లు గడ్డి కలుపును ఏరివేసి ఆ మొక్కల పెరుదలకు ఆటంకం లేకుండా చేశారు.
ఐదుగురు కార్యకర్తలు మాత్రం “స్వాగత ద్వారం” వద్ద రోడ్డు మార్జిన్ లో మట్టి కొట్టుకుపోకుండా ఉండడానికి పెగ్గులు పాతి అడ్డుగోడలా కట్టారు. అక్కడ ఉన్న సువర్ణ గన్నేరు మొక్కలను వరుస క్రమంలో సరిజేసి అందంగా తయారుచేశారు.
6 గంటల తర్వాత మ్రోగిన విజిల్ మ్రోతకు పనికి విరామమిచ్చి, కాఫీ సేవించిన పిదప కార్యకర్తల ఒక చోట సమూహంలా చేరుకుని గ్రూప్ ఫోటో దిగి, రక్తదాత కస్తూరి విజయ్ కుమార్ పలికించిన నినాదాలకు 18 మంది కార్యకర్తలు “సాధిస్తాం సాధిస్తాం” అని పలికి,
రేపు మరల కలవలవలసిన చోటు ఇదే ‘శారదా గ్రాండియర్’ వద్ద అనుకుని గృహోన్ములయ్యారు.
- నందేటి శ్రీనివాస్
ప్రజా కళాకారుడు
15.09.2025.
ప్రశ్నల పరంపర – 11
అడిగితిని గద చల్లపల్లిని – “అసలు నీ గత చరిత్రములో
ఇంత కళకళ, పచ్చదనమూ, ఈ సజీవత ఎప్పుడైనా
అనుభవించిన గుర్తు ఉందా?” అనిన ప్రశ్నకు సమాధానం
“లేదు లేదిది అపూర్వం - ఒక అద్భుతం” అని బదులు పలికెను!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
15.09.2025.