సీనియర్ స్వచ్ఛ కార్యకర్త తూములూరి లక్ష్మణరావు గారి ఇంటి వివాహ వేడుక.....           01-Aug-2025

చల్లపల్లి స్వచ్ఛ సుందర ఉద్యమం మొదలైనప్పటి నుండి ఇంకా చెప్పాలంటే ఇక్కడి జనవిజ్ఞానవేదిక సమావేశాల్లో కూడా - డా. డి‌.ఆర్‌. కె. గారు పదేపదే ప్రస్తావించే విషయం ఒక్కటే! 

          సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల్ని నిత్య జీవితంలో మనం వాడకుండా ఇతరులకు ఆదర్శంగా ఉండాలని. ఈ స్వచ్ఛ సుందరోద్యమంలో ఊరి వీధుల్లోనూ, రహదారులలోనూ స్వచ్ఛ కార్యకర్తలు అలాంటి ఏకమాత్ర ప్రయోజనకర వస్తువుల్ని ఏరి, ఊడ్చి ట్రాక్టర్ల కొద్దీ డంపింగ్ యార్డుకు చేరుస్తూనే ఉన్నారు. తమ దైనందిన జీవితంలో వాటికి తావులేకుండా జాగ్రత్త పడుతున్నారు.

          దీనికి తాజా ఉదాహరణం సీనియర్ స్వచ్ఛ కార్యకర్త తూములూరి లక్ష్మణరావు గారి ఇంటి వివాహ వేడుక.

          నిన్న రాణీ భవానీ దేవి కళ్యాణమండంపంలో సుమారు నాలుగైదొందల మంది అతిధులు హాజరైన, భోజనాలు చేసిన సందర్భంలో ఎక్కడా

* ప్లాస్టిక్ విస్తర్లు కనిపించలేదు సాంప్రదాయక పర్యావరణహిత విస్తేర్లే   

* ప్లాస్టిక్ సీసాలు, ప్లాస్టిక్ గ్లాసులు, కప్పులు, స్పూన్లు ఏవీ వాడలేదు చెక్క స్పూనులు వగైరాలే.

* వధూవరుల పేరుతో ఫ్లెక్సీలు లేవు గుడ్డ బ్యానర్లు మాత్రమే,

* చివరకు స్వీట్లను, కిళ్ళీలను కూడా ప్లాస్టిక్ పేపర్లలో చుట్టి అందించలేదు.

          ఈ మధ్యకాలంలో చాలా వివాహ, తదితర వేడుకలకు హాజరయ్యాను కానీ ఈ మాత్రపు పర్యావరణహితమైన హరిత వేడుకను  ఎంతో సంతోషించాను. అందుకు వధూవరులు భార్గవి నాగ సాయి కిరణ్ లను, నిర్వాహకులైన లక్ష్మణరావు - వెంకటేశ్వరమ్మ గార్లను తప్పక అభినందించాలి.

          చల్లపల్లి స్వచ్ఛ కార్యకర్తల నినాదం  - ఎప్పుడైనా ఒట్టి మాటలు కాదు, ఆచరణే ప్రభావశీలంగా ఉంటుందిఅని మరొకమారు ఋజువుచేశారు.

- ప్రసాదు వేల్పూరి

   చల్లపల్లి స్వచ్ఛ కార్యకర్త

   01.08.2025