రవీంద్రనాథ్ గురుదేవుని సూక్తి ....

 చల్లపల్లి స్వచ్చ సుందర కార్యకర్తల శ్రమదానానికి అతికినట్లు సరిపోయే రవీంద్రనాథ్ గురుదేవుని మేటి సూక్తి ఇది!

          “ఆ చెట్ల నీడలు తమ కోసం కాదని తెలిసీ, చెట్లు నాటి, పెంచుతున్నారంటే ఆ వ్యక్తులు మానవ జీవన పరమార్థాన్ని ఆకళించుకొంటున్నారన్నమాట!”

          ఇంచుమించు ఇదే సారాంశం 1962 నాటి తెనాలి రామకృష్ణ” సినిమా కోసం సముద్రాల రాఘవాచార్య వ్రాసి, ఘంటశాల గానం చేసిన గీతంలో కూడ!

          .... నాటేదీ ఒక్క మొక్క వేసేదీ నూరుకొమ్మ...

          అవి కాయాలీ బంగారుకాయలూ...

          భోంచేయాలీ మీ పిల్ల కాయలూ

          రహదార్ల వెంట మొక్క నాటి పెంచరా!

          భువిని తరతరాల నీదు పేరు నిలుచురా!

          ఎన్నికష్టాలు రానీ - నష్టాలె గానీ...

          చేసేది ఏమిటో చేసేయి సూటిగా...

.... అనే పెద్దల సూక్తుల్ని ప్రతి వేకువా సార్థకంగా ఆచరిస్తున్న స్వచ్ఛ కార్యకర్తలు ధన్యులు!

- నల్లూరి రామారావు

  12.10.2024.