పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?
తుఫాన్ వర్షమూ V కార్యకర్తల సహనమూ - @3264*
ఈ సమాచారం17.10.24 గురువారం వేకువ-ముప్పదినొక్కరు మంది కార్యకర్తల రహదారి నాణ్యతా చర్యల గురించి. వృత్తి ధర్మాన్ననుసరించి, వాననీ, ఉక్కనీ, చలీ-మంచుల్నీ ఎందుర్కొంటూ శ్రమించడం చల్లపల్లి స్వచ్చ కార్యకర్తలకు క్రొత్తేం కాదు గాని, ఈ పూట వాళ్లకు తగిలింది అదాటు-దబాటు వాన దెబ్బ!
ఒక ప్రక్క పని వేళకే నెల్లూరవతల వాయుగుండం తీరం దాటుతున్నప్పుడు కార్యకర్తలే ఈ పూట పని వాయిదా వేయచ్చు గదా! ఉభయులూ ఒకే మారు డ్యూటీ కి దిగారు మరి! 10 నిముషాలు మాత్రం కార్యకర్తలే కాస్త వెనక్కు తగ్గి పని ఆపారు-ఇద్దరు రైతు మహాశయులు తప్ప!
2-3 మార్లు శ్రమదానంతో ఆటలాడుకొన్న వరుణుడు అమాయకంగా వెనక్కిపోయి, మళ్లీ పెళఫెళా ఎండ! అప్పటికి మిగిలిన కాస్త సమయంలో ఈ వాలంటీర్ల పనేంటయ్యా అంటే రహదారి మీద నిలిచిన నీళ్ళ మడుగుల్ని డ్రైనులోకి నడిపించడం ఫొటోల్లో ఉంటే మీరూ చూడవచ్చు!
వాన రాకడకు ముందైతే – ప్రక్కకు ఒరిగిపోతున్న చెట్లు లాగి, నిలబెట్టి, త్రాళ్లు బిగించే రైతు కార్యకర్తలూ, అర నిమిషం కూడ వృధా చేయక మిషన్ తో గడ్డి చెక్కిన ఆకుల కార్యకర్తా పాతిక-ముప్పై పూల మొక్కల పాదుల గడ్డి పీకిన 15 గురూ, కత్తులకు పని చెప్పిన 6-7 గురూ, ఇదంతా గంగులవారిపాలెం క్రాసు రోడ్డుకు పడమరగా నన్నమాట!
చల్లపల్లి వారు రాకున్నా-రహదారి ప్రయాణికులు కారు ఆపి, ఈ తుఫానులో 30 మంది స్త్రీపురుషులెందుకిలా వీధి పనులకు దిగారా అని ఆరా తీసి, ఆశ్చర్యపోయారు.
ఇక-6.20 సమయంలో-కస్తూరి విజయ్ స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలు విన్పించాక-ఇద్దరు వృద్దులూ, ఒక యువతీ-నాదెళ్ళ పూర్ణచంద్రరావు-కుసుమకుమారి-రావి సాయి బిందులు పాల్గొన్న సమావేశంలో-
U.S.A. లో 2-10-24 న 100 కి.మీ. పరుగు పెట్టి, నాదెళ్ల సురేష్ తన ఊరి శ్రమదానోద్యమం కోసం సేకరించిన 5 లక్షల చెక్కును DRK గారికి సమర్పించడం చూడండి!
తన 02.10.2024 నాటి 100 కి. మీ. పరుగును తీవ్రమైన ఉష్ణోగ్రతలో విజయవంతంగా ముగించిన సురేష్ నాదెళ్ల గారిని, ఆయన శిక్షకుడు Bill Odendahl గారిని మన స్వచ్చ సుందర చల్లపల్లి అచ్చ తెలుగు బ్యానర్ తో గమనించండి.
రేపటి మన శ్రమదానం NH 216 లోనే అని గుర్తుంచుకొండి!
పైకి మాత్రం కానిపించదు
మారుమూలన చల్లపల్లిలొ మనం చేసే స్వచ్ఛ ప్రక్రియ
ప్రశాంతంగా సాగిపోవును – పైకిమాత్రం కానిపించదు
సదాలోచన పరుల మదిలో చాప క్రిందగ నీరులాగా
దేశమంతా ప్రాకుచున్నది - దీప్తులను వెదజల్లుచున్నది!
- నల్లూరి రామారావు
17.10.2024