3299* వ రోజు ....

 పర్యావరణ విధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?

రేపే మన 3300* పని దినాల పండగ!

          ఈ గురువారం (24.11.24) వేకువ మాత్రం 4:126:08 సమయాలు మధ్య - 32 మంది శ్రమించింది కళ్ళేపల్లి బాటx అవనిగడ్డ దారి వద్దనే గాని, రేపటి వేకువ - అనగా అరుదైన 3300* నాడు మాత్రం 4.30 కి బదులుగా 5:006:30 నడుమ గంగులవారిపాలెం ప్రక్కనే! అది కూడ సుమారు 100 మొక్కల ప్రతిష్ఠాపనే!

          ఈ ఉదయం బాగా చలి మెలిపెడుతున్న వేళ నిన్నటికన్న ఒకరిద్దరు శ్రమకర్తలు తగ్గారు గాని జరిగిన పనిలో మాత్రం తగ్గుదల లేదు. ఎందుకంటే

1) రహదారి దక్షిణాన,

2) శివరాంపురం వీధి ప్రారంభాన

3) MTM దిశగా బస్ షెల్టర్ దగ్గరా ఈ 32 మందిక్కాదు - 52 మందికైనా చాలినంత పని దొరికేది.

          మందుసంబరాలు గ్రామంలోకి తరలిపోయి, ఇక్కడ ప్లాస్టిక్ వ్యర్ధాల బెడద కాస్త తగ్గింది గాని, ఎవరెక్కడి నుండి తెచ్చిపడేస్తున్నా రో తెలియదు - గోతాల కొద్దీ రకరకాల తుక్కులు మొన్నటి దాక ఈ  కూడలి వద్ద వీరవిహారం చేశాయి!

          అవి కాస్త తగ్గినా - ఈ పూట కూడ డజను డిప్పల గ్లాసులూ, సీసాలూ, కప్పులూ దొరికాయి. రాదారి దక్షిణపు 60-70 గజాల పల్లం 16-17 మందికి పని చూపింది! అందులో 4 గురు మహిళలు!

          సాగర్ ఆక్వా దిశగా రోడ్డు రెండు మార్జిన్లూ ఇసుక + రాతి ముక్కలు క్రమ్మివేస్తే ఒక ఇంజనీరూ, ఇంకో చెక్ పోస్టూ, సిక్స్ ఫేస్డు వ్యాపారీ, నాతో సహా ముగ్గురూ గోకుడు పారలకు పని చెప్పి, డిప్పలకెత్తి మోసి, ఎత్తుపల్లాల్ని సరిజేశారు!

          ఇక్కడికి తూర్పుగా బస్ షెల్డరు దగ్గర 5 గురు సుందరీకర్తలు గత 3 రోజులుగా చేసిన సుందరీకరణలకు మెరుగులు దిద్దారు!

          కొద్దిమంది గ్రామస్తులు మాత్రం - సొంత పనుల కోసం వెళ్తూ వస్తూ ఈ 32 మంది చేష్టల్ని చూస్తూ ఉదాసీనంగా నిష్క్రమించారు.

          సమీక్షా సభారంభం అప్పటి దాక చెత్త బండెక్కిన ఓటికాళ్ల మాలెంపాటి అంజయ్య గర్జా సదృశ్య నినాదాలతో జరిగి, 50 పని గంటల కష్టాన్ని DRK వైద్యులుంగారు సమీక్షించి,

          వారితోబాటు నలుగురైదుగురు నిన్నటి - నేటి శ్రమ ఫలితంగా అందం ఇనుమడించిన 3-4 వందల గజాల వీధుల్ని తనివి తీరా ప్రస్తుతించగా ముగిసెను!

          ద్విగుణీకృతోత్సాహంతో రేపటి వేకువ గంగులవారిపాలెం వద్దనే మన పునర్దర్శనం!

          బాల భానుడు సంతసించెను

నిండు చంద్రుడు మెచ్చినాడే పండు వెన్నెల ప్రసారిస్తూ

బాల భానుడు సంతసించెనె పసిడి కిరణాలతొ హసిస్తూ

శీత పవనుడు కార్యకర్తల చెమట నార్పుచు సంతసించెను

ఊరి జనములు సగంమందే ఉత్సహించరు - సహకరించరు!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   21.11.2024