3323* వ రోజు....

 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల్ని వాడబోం! వాడబోం! నార చేతి సంచుల్నే - వాడతాం! వాడతాం!

         శుభ్రపడిన అమర స్థూప ప్రాంగణం - @3323 *

          సమయం 4.20 &6.30.  స్థలం – ఊరికి సుమారు 2 కిలో మీటర్ల దూరంలో నాగాయలంక దారిలో ఏనాడో అమరవీరుల జ్ఞాపకార్థం నిర్మించబడిన సమున్నత కట్టడం. అక్కడికి చేరుకొన్నది 40 మందికి పైగా స్వచ్చ సుందర కార్యకర్తలు.

          వామపక్ష ఉద్యమాలలాగే సదరు స్తూపం పర్యవేక్షణ కూడ ఇటీవల సన్నబడింది. ఈ రోజు వామపక్షీయుల ప్రదర్శనలు, ATM సెంటరు  వద్ద మహా సభ జరుగుతున్న సందర్భంగా స్వచ్చ కార్యకర్తలు తమ వంతు బాధ్యతగా ఆస్థూప పరిసరాలను అందంగా, పరిశుభ్రంగా తయారుచేసి అమరవీరుల త్యాగాలకు సముచితంగా నివాళులర్పించారన్న మాట .

          స్థూప ప్రాంగణాన్ని  నిన్నటి దాక రంగులతో, జెండాలతో అలంకరించిన సంగతి సరే. ఈ రోజు డజన్ల కొద్దీ కార్యకర్తలు లోపల ఊడ్చి చుట్టూ వదిలిన ఖాళీ స్థలంలో పూల మొక్కలు నాటారు. మరికొందరు వెలుపల బురద మట్టి పైన బుసకను సరిదిద్ది అందంగా రూపొందించారు. పనులు పూర్తయ్యాక ఇక నాగాయలంక రోడ్డును ఊడ్వడంలో శ్రమించారు.  

      మరికొందరైతే ఇక్కడికి దూరంగా రియల్ ఎస్టేట్ ప్రాంతంలో కూడ ఇలాంటి సేవలను సమర్పించారు.

          ఈ విషయాలన్నీ మన ‘ జై  స్వచ్చ చల్లపల్లి సైన్యం’ వాట్సాప్ చిత్రాలలో గమనించగలరు. మధ్యాహ్నం  2 గంటలకు జరిగే ప్రదర్శనలోనూ, మహా సభకు హాజరు కాగలరు.

రేపటి స్వచ్ఛ కార్యక్రమం కోసం భగత్సింగ్ గారి ఆసుపత్రి వద్ద కలుసుకుందాం.   

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   15.12.2024