ఒక్కసారికి మాత్రం పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులు మనం ఎందుకు వాడాలి?
స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం –1976* వ నాటి స్వచ్చ శుభ్ర కృషి సమీక్ష :
నేడు 4.04 నుండి 6.10 గంటల వరకు జరిగిన స్వచ్చ కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలు 23 మంది. తరిగోపుల ప్రాంగణం వద్ద ఆగి చిల్లలవాగు ఉత్తరపు గట్టుకు ఇరువైపులా కలుపు మొక్కలను తీసివేసి ఆ ప్రాంతాన్ని శుభ్రంగా తయారుచేశారు. చల్లటి గాలితో, చిరుజల్లుతో వాతావరణం ఈరోజు అనుకూలంగా ఉంది.
సుందరీకరణ బృందం వారు బందరు రోడ్డులో ఉన్న 6 వ నంబరు పై ఉన్న కల్వర్టు దక్షిణపు గోడకు రంగులు వేసి, నినాదాలు రాసి, బొమ్మలు వేసి అందంగా తయారుచేశారు. వర్షం వల్ల ఈ కార్యక్రమానికి మధ్యమధ్యలో అంతరాయం వచ్చినా ఈ పనిని ఈ రోజు పూర్తి చేశారు.
రేపటి స్వచ్చ కార్యక్రమం కోసం విజయవాడ బాట ప్రక్కన గల తరిగోపుల ప్రాంగణం వద్ద కలుద్దాం.
బ్రహ్మ ముహూర్తపు దీక్షలు.
స్వచ్చోద్యమ చల్లపల్లి కధాక్రమం బెట్టి దనగ –
సామాజిక ఋణ విముక్తి తాత్త్వికతె పునాదిగా –
గృహిణులు – పిల్లలు – వృద్ధులు వీధి కెక్కి ఊడ్చు చర్య!
బ్రహ్మముహూర్తాన ఊరు బాగుచేయు కఠిన దీక్ష!
- డా. డి. ఆర్. కె. ప్రసాదు,
(స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త, మేనేజింగ్ ట్రస్టీ - ‘మనకోసం మనం’)
గురువారం – 09/04/2020
చల్లపల్లి.