1978*వ రోజు....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడవద్దు. 

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం 1978* వ నాటి స్వచ్చ శుభ్ర కృషి సమీక్ష :

          నేడు 4.08 నుండి 6.00 గంటల వరకు జరిగిన స్వచ్చ కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలు 27 మంది. తరిగోపుల ప్రాంగణం వద్ద ఆగి చిల్లలవాగు ఉత్తరపు గట్టుకు ఇరువైపులా కలుపు మొక్కలను తీసివేసి ఆ ప్రాంతాన్ని శుభ్రంగా తయారుచేశారు.

          కొంతమంది కార్యకర్తలు వక్కలగడ్డలో చిల్లలవాగు గట్టు వద్ద ఉన్న బస్ షెల్డర్ ముందు, వెనుక కలుపు మొక్కలను నరికి ఆ ప్రాంతమంతా శుభ్రం చేశారు.

          మరికొంతమంది కార్యకర్తలు తరిగోపుల ప్రాంగణమునకు, చిల్లలవాగు వంతెనకు మధ్య గల ప్రాంతంలో ఎత్తుపల్లాలను సరిచేశారు. వంతెన భాగాన్ని శుభ్రం చేశారు.  

          రేపటి స్వచ్చ కార్యక్రమం కోసం బందరు రోడ్డులో భగత్ సింగ్ గారి హాస్పిటల్ వద్ద కలుద్దాం.

        మాతృమూర్తులు నిజంగానే!

వీధులను తమ ఇళ్ళు గానూ - ఊరునే తమ కుటుంబంగా

ఇన్ని వేల దినాల నుండీ నిజంగా ఈ మహిళలిందరు

అందగించీ - స్వస్త పరచీ - సాకి పెంచీ - శుభ్ర పరచీ

మాతృ దేవతలుగా మారే మహద్భాగ్యం ప్రదర్శించారా!

- డా. డి. ఆర్. కె. ప్రసాదు,

(స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త, మేనేజింగ్ ట్రస్టీ - మనకోసం మనం’)

శనివారం – 11/04/2020

చల్లపల్లి.