1982* వ రోజు....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడవద్దు. 

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం 1982* వ నాటి శుభ్రతా చర్యలు :

నేటి ఉదయం 4.00-6.15 వరకు జరిగిన స్వచ్చ కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలు 30 మంది.  

విజయవాడ రోడ్డు లోని పెట్రోలు బంకు వద్ద టైల్స్ పై ఉన్న ఇసుకను కొంతమంది ఊడ్చి ఎత్తి వేశారు. బస్ షెల్టర్ ముందు భాగాన్ని కూడాశుభ్రం చేశారు.

 కొంతమంది కార్యకర్తలు బంకు  ప్రక్కన , కరెంట్ ఆఫీసు ముందు, NTR పార్కు ముందు ఉన్న డ్రైనేజి మట్టిని  సరిజేశారు. సరిజేసిన తరువాత ఈ ప్రాంతాలు శుభ్రంగానూ, వెడల్పుగానూ ఉన్నాయి.

 మరికొంత మంది కార్యకర్తలు  కరెంట్ ఆఫీసు వద్ద ఉన్న పిచ్చి మొక్కలను నరికి ట్రాక్టర్ లో లోడు చేసి డంపింగ్ యార్డు కు తరలించారు.

సుందరీకరణ బృందం చిన్న రాజా గారి గోడను శుభ్రం చేసి రంగులు వేసే పనిలో నిమగ్నమయ్యారు.

రేపటి కార్యక్రమం కోసం విజయవాడ రోడ్డు లోని పెట్రోలు బంకు వద్దే కలుసుకొందాం.  

  డా. డి. ఆర్. కె. ప్రసాదు

మేనేజింగ్ ట్రస్టీ- మనకోసం మనం

బుధవారం – 15/04/2020

చల్లపల్లి.  

4.0నిలకు N T R పార్కు వద్ద
డ్రైనేజి ను శుభ్రం చేస్తున్న కార్యకర్తలు.
డ్రైనేజీ మట్టిని సర్దినతర్వాత అందంగా కనపడుతున్న ప్రాంతం.