ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడవద్దు.
స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం –1983* వ నాటి శ్రమదాన చర్యలు :
నేటి ఉదయం 4.01-6.15 వరకు జరిగిన స్వచ్చ కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలు 27 మంది.
విజయవాడ రోడ్డు లోని పెట్రోలు బంకు లో ఉన్న తోటను శుభ్రం చేసి, టైల్స్ పై ఉన్న ఇసుకను ఊడ్చి ఎత్తి వేశారు.
విజయవాడ రోడ్డు కు ఇరువైపులా డ్రైనేజి త్రవ్వగా వచ్చిన మట్టిని ఆ ప్రాంతం లోని ఎత్తు పల్లాలను సరిచేసి అందంగా సర్దారు.
ఈ విధంగా చేయడం వలన ఆ ప్రాంతమంతా పార్కింగ్ కి అనుకూలంగా మారింది.
NTR పార్కు బయట ఉన్న తోటలో కలుపు తీసి, చెత్తనంతా డంపింగ్ యార్డు కు తరలించారు.
సుందరీకరణ కార్యకర్తలు బందరు రోడ్డు లోని చిన రాజా గారి ప్రహరీ గోడకు రంగులు వేసే కార్యక్రమాన్ని నేడు కూడా కొనసాగించారు.
రేపటి కార్యక్రమం కోసం విజయవాడ రోడ్డు లోని పెట్రోలు బంకు వద్దే కలుద్దాం!
డా. డి. ఆర్. కె. ప్రసాదు
మేనేజింగ్ ట్రస్టీ- మనకోసం మనం
గురువారం – 16/04/2020
చల్లపల్లి.
ఇపుడు గూడ ఊరి శుచికె
ఆక్రందన-దిగ్బంధన-భయ విహ్వల సంస్పందన
కని విని యెరుగని కరోన కఠోర విలయం జగాన
అది శుభ్రత లోపించిన ఆవహించు వ్యక్తి పైన
ఊరి శుచికె స్వచ్చ సేన ఉద్యమించు దినదినాన!
నల్లూరి రామారావు
సభ్యులు- మనకోసం మనం ట్రస్టు
గురువారం – 16/04/2020
చల్లపల్లి.