ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడవద్దు.
నేటి ఉదయం 4.06-6.15 వరకు జరిగిన స్వచ్చ కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలు 29 మంది.
విజయవాడ రోడ్డు లోని పెట్రోలు బంకు లో ఉన్న టైల్స్ పై ఉన్న ఇసుకను ఊడ్చి ఎత్తి వేశారు. గత మూడు రోజుల నుండి ఈ ప్రాంతాన్ని , లోన ఉన్న తోటను శుభ్రం చేయడం వలన బంకు ప్రాంతమంతా విశాలంగా, శుభ్రంగా, సుందరంగా కన్పిస్తున్నది.
NTR పార్కుకు ఎదురుగా డ్రైనేజి త్రవ్వగా వచ్చిన మట్టిని ఆ ప్రాంతం లోని ఎత్తు పల్లాలను సరిచేసి అందంగా సర్దారు.
ఈ విధంగా చేయడం వలన ఆ ప్రాంతమంతా పార్కింగ్ కి అనుకూలంగా మారింది.
NTR పార్కు బయట ఉన్న మూడు తోటలలో కలుపు తీసి, చెత్తనంతా డంపింగ్ యార్డు కు తరలించారు. ఇలా చేయడం వలన ఈ మూడు తోటలు అందంగా కన్పిస్తున్నాయి.
పంచాయతీ వారు ఇచ్చిన యాంటీ సెప్టిక్ లోషన్ ను NTR పార్కు నుండి శివాలయం వరకు రోడ్డు కిరువైపులా పవర్ స్ప్రేయర్ తో స్ప్రే చేశారు,
సుందరీకరణ కార్యకర్తలు బందరు రోడ్డు లోని చిన రాజా గారి ప్రహరీ గోడకు రంగులు వేసే కార్యక్రమాన్ని నేడు కూడా కొనసాగించారు. రేపటి కార్యక్రమం నారాయణ రావు ప్రధాన వీధిలో. దీనికోసం బాలాజి అపార్ట్మెంట్స్ వద్ద కలుసుకొందాం!
డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
మేనేజింగ్ ట్రస్టీ- మనకోసం మనం
శుక్రవారం – 17/04/2020
చల్లపల్లి.
స్వచ్చ సైన్యం శాశ్వతంగా సంస్కరించేనా!
శ్రమ విరాళం సమర్పిస్తూ- క్రమ వికాసం ప్రోది చేస్తూ
స్వచ్చ- సుందర- శుభ్రతలకై-సాహసంతో- చొరవతో-పం
దొమ్మిదొందల నాళ్ల పైగా జనం మెప్పును పొందుతూ ఈ
స్వచ్చ సైన్యం నిజంగానే చల్లపల్లిని సంస్కరించిందా!
నల్లూరి రామారావు
సభ్యులు- మనకోసం మనం ట్రస్టు
శుక్రవారం – 17/04/2020
చల్లపల్లి.