3430* వ రోజు ....

 ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్ సామాన్లు  దండగ!

మళ్ళీ మళ్ళీ వాడదగు స్టీలు వస్తువులే పర్యావరణ పండగ!

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం @3430* వ రోజు

         చీపురు పట్టు చెత్తను నెట్టు స్వచ్ఛ సుందర చల్లపల్లినీ పట్టు.

         ఇదే భావితరాలకు ఆయువుపట్టు.

         మంగళవారం ఉదయం 4:20 నిమిషాలకు ప్రారంభమైన ఈరోజు శ్రమదానం పాగోలు రోడ్డును సుందరసోభాయమానముగా తీర్చిదిద్దుటకై సోదరీ సోదరీమణులు పాల్గొనుట సంతోషింపదగినది.

         పాగోలు రోడ్డును శుభ్రపరచటలో ఇరువైపులా ఉన్న చెత్తాచెదారం తొలగించబడింది.

         కొమ్మలు, రెమ్మలు దిట్టమైన తాటిబొందలు కటింగ్ మిషన్ తో కత్తిరించి పక్కన పెట్టడం జరిగింది.

         మరికొందరు చీపిరి పట్టుకుని రోడ్డుకి ఇరువైపులా శుభ్రం చేయగా బైబిల్ విద్యార్థులు బుట్టలో వేసుకుని మంటలో వేయటం జరిగింది

         ఈరోజు శ్రమదానం 30 మందితో జరిగింది. గోపాలకృష్ణయ్య గారు ఇచ్చిన గుక్కెడు మంచినీళ్లు గొంతులో పోసుకుని పనిలో ముందుకు సాగుతున్న వేళా విశేషం నేను నినదించగా డాక్టర్ గారు యువతను మంచి మార్గంలో నడిచేట్లు చూడాలని బైబిల్ తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ మరల రేపటి శ్రమదానం ఇక్కడే అని తీర్మానించటం జరిగింది.

- డేవిడ్ గోల్కొండ,

   01.04.2025.