3514* వ రోజు .....

 ఒకసారి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వాడకం మానేద్దామని నినదిద్దాం!

29.06.2025 ఆదివారం 3514* వ రోజు నాటి స్వచ్చ సేవల విశేషాలు! 

          వేకువ జాము 4.15  నిముషాలకు 19 మంది కార్యకర్తలతో హైవే రోడ్డు పై స్వాగత ద్వారం సమీపంలో పని మొదలు పెట్టబడింది. అక్కడ స్వాగత ద్వారం గోడ క్రింది భాగాన పిచ్చి గడ్డిని, అక్కడే బోగన్  విలియా మొక్కలలో కలుపును తీసి శుభ్రపరచడం జరిగింది.

         మరికొందరైతే కాలువ వంతెన దాటి మలుపులో ఏపుగా  పెరిగి దారికి అడ్డుగా వచ్చిన గద్దగోరు మొక్కలను కొంత భాగం కట్ చేసి దారికడ్డు తొలగించడమైనది. మరి కొంతమంది దారి ప్రక్కనే ఉన్న స్వచ్చ సుందర చల్లపల్లి బోర్డుకు కింది భాగంలో పిచ్చి మొక్కలను తీసి శుభ్ర పరచారు.

         5 గంటలు దాటే సమయానికి మొత్తం 44 మంది కార్యకర్తలు చేరికతో ఎవరి పని వాళ్లు చేస్తూ కొంతమంది ఉన్న చెత్తను, కొమ్మలను లోడింగ్ చెయ్యడం మొదలు పెట్టి మొత్తం లోడ్ చేయడం జరిగింది.

         6 గంటలకు విజిల్ మ్రోగగానే అందరూ పనికి విరామమిచ్చి సమీక్షా సమావేశంలో పాల్గొనగా ఈ రోజు స్వచ్చ చల్లపల్లి కి విచ్చేసిన సర్పంచ్ కృష్ణ కుమారి గారు పలికిన జై స్వచ్చ సుందర చల్లపల్లి కి జై కొట్టి రేపు కలవవలసిన ప్రదేశం కూడా ఈ స్వాగత ద్వారం వద్దనే అనుకొని నిష్క్రమించారు.      

 

- నందేటి శ్రీనివాస్

   ప్రజాకళాకారుడు

  29.06.2025

         ఏకాదశ వసంతాల

సామాజిక సామూహిక శ్రమ ఎవ్వరికీ తెలియని

బ్రహ్మపదార్థం కాదని, గ్రామస్తులు నేర్వదగిన

సాధారణ విద్యేనని, ఫలితం మాత్రం ఘనమని

ఏకాదశ వసంతాల ఈ ఉద్యమ సందేశం!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   లాస్ ఏంజల్స్ - USA

    29.06.2025