ఒకసారికి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులను మనం వాడటం ఆపేద్దాం!
6.7.2025 ఆదివారం 3521* వ రోజు నాటి శ్రమజీవన సౌందర్యం!
216 జాతీయ రహదారిపై క్లబ్ రోడ్ కు అతి సమీపంలో రహదారి పొడవునా పై భాగంలో, క్రింది భాగంలో ఉన్న పిచ్చి కంపను తుదముట్టించి పరిశుభ్రం చేయుటకు తెల్లవారు జామున 4:19 నిమిషాలకు 15 మంది కార్యకర్తలు వంతెన వద్దకు వచ్చారు.
పదునైన కత్తులు, గొర్రులు, దంతులతో ఎలాంటి పిచ్చి మొక్కలను, ముళ్ళ పొదలనైనా అవలీలగా తీసివేసి క్రింది భాగంలో పెద్ద మొక్కల వద్ద పై భాగంలో పూల మొక్కల చుట్టూ శుభ్రపరిచారు.
ఆదివారం సెలవు దినం కావడంతో తక్కువ సమయంలోనే 37 మంది కార్యకర్తలు పనిలో పాల్గొని ఎంతో ఉత్సాహంగా పని చేశారు. పెద్ద మొక్కలకు మాత్రం మొదళ్ళు బలపడడానికి సరిపడా మట్టిని చుట్టూ బలంగా వేయడం వంగిన మొక్కలకు కర్రలు పాతి నిలబెట్టడం ఆపని కొనసాగుతూ ఉంది.
ఒకరిని ఒకరు పిలవకుండా ఎవరికి వారు నిద్ర లేచి ఆ వేకువ సమయంలో గ్రామ స్వచ్చత కోసం దశాబ్ది కాలంపైబడి స్వచ్చందగా వచ్చి సేవ చేయడం, ఒక చారిత్రాత్మక విషయం.
6 గంటల వరకూ పని చేసిన కార్యకర్తలు విజిల్ మ్రోగగానే పనికి విరామమిచ్చి కాఫీ సేవించిన పిదప యాక్స్ టైలర్స్ వెంకటేశ్వరరావు గారు కార్యకర్తలందరికీ గుడ్డ సంచులు అందజేశారు. సుజాత డిపార్ట్మెంట్ స్టోర్ అధినేత హనుమంతరావు గారు అందించిన అల్పాహారం తీసుకుని సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.
శివబాబు గారు పలికిన జై స్వచ్చ సుందర చల్లపల్లి నినాదాలకు సాధిస్తాం అంటూ ప్రతినౠని,
రేపు కలవవలసిన ప్రదేశం హైవే లోని కోత మిషన్ ఉన్న ప్రదేశం దగ్గర అనుకుని నిష్క్రమించారు.
- నందేటి శ్రీనివాస్
ప్రజాకళాకారుడు
06.07.2025
చల్లపల్లికి మేలు బంతిగ
ఊరి కెంతో దూర దూరం ఉన్నదసలే వంద గృహములు
ఊరికంతకు చివరి వార్డు ఉత్తములు ఈ వార్డు జనములు
ఎంత పని - ఈ ప్రాంతమంతా ఇతోధికముగ అందగించుట
చల్లపల్లికి మేలు బంతిగ సర్వ విధముల తీర్చిదిద్దుట?
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
లాస్ ఏంజల్స్ - USA
06.07.2025