పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం?
26.07.2025 శనివారం 3541* వ రోజు శ్రమదాన సంగతులు!
వేకువ 4.13 నిమిషాలకు ఊరి బాగుదల కోసం 13 మందితో మొదలైన శ్రమదానం నెమ్మదినెమ్మదిగా 36 మందికి చేరింది.
ముగ్గురు బలమైన కార్యకర్తలు వంతెన వద్ద ఎప్పటి నుండో మురుగు కాల్వలోకి పడిపోయేట్లుగా ఉన్న వంతెనలోని ఒక ముక్కను ట్రాక్టర్ సహాయంతో రోడ్డు అంచుకు చేర్చారు.
జాతీయ రహదారి నుండి పద్మావతి ఆసుపత్రికి వచ్చే బజారులో ఉన్న వంతెన వద్ద నుండి రోడ్డుకు ఇరువైపులా గతంలో నాటిన మొక్కల వద్ద కలుపును తీసి వాటి చుట్టూ మొలిచిన పిచ్చి చెట్లను, తుక్కును, గడ్డిని శుభ్రం చేశారు.
ఒక కార్యకర్త రోడ్డు ప్రక్కల అందవిహీనంగా అడ్డదిడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను ట్రిమ్మర్ సహాయంతో కట్ చేసి ఆ కొమ్మలను రోడ్డుకు దన్నుగా క్రింది భాగంలో ఒక క్రమపద్దతిలో ఇద్దరు కార్యకర్తలు సరిచేశారు.
మహిళా కార్యకర్తలు రోడ్డునంతా శుభ్రంగా ఊడ్చి అద్దంలా తయారుచేశారు.
వాతావరణం అనుకూలంగా ఉండడంతో ఈల వేయడం కాస్త ఆలస్యమైనా కార్యకర్తలేమాత్రం లెక్కచేయకుండా ఉల్లాసంగా ఉత్సాహంగా పనిని కొనసాగిస్తుండగా 6:30 కు విజిల్ మ్రోగిన తరువాత కార్యకర్తలంతా కాఫీ సేవించి సమీక్షా సమావేశంలో పాల్గొని గ్రామ సర్పంచ్ “శ్రీమతి పైడిపాముల కృష్ణకుమారి” గారి నినాదాలకు బదులిచ్చి,
రేపు విజయాకాన్వెంట్ వద్ద జరిగే మెడికల్ క్యాంపు దృష్ట్యా ఆరోడ్డును శుభ్రం చేయాలనుకుని రేపటి కార్యక్రమం కోసం విజయవాడ రోడ్డులోని గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద కలుసుకుందామని నిశ్చయించుకుని,
గురవయ్య మాస్టారు చెప్పిన సూక్తులు విని ఆనందంగా కార్యకర్తలంతా తిరుగుముఖం పట్టారు.
- దాసరి రామకృష్ణ ప్రసాదు
26.07.2025.
మహా మహులకె సాధ్యపడనిది
మహా మహులకె సాధ్యపడనిది – మధ్యలోనే వదలినట్టిది
చాల ఊళ్లలొ ప్రయత్నించీ, సాహసించీ జరగనట్టిది
తలలు బ్రద్దలు కొట్టుకొను పరిశీలకులకూ బోధపడనిది
స్వచ్ఛ సుందర చల్లపల్లిలొ దశాబ్దంగా సాగుచున్నది!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
లాస్ ఏంజల్స్ - USA
26.07.2025