3545* వ రోజు ....

 పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం?

30.07.2025 - 3545* వ రోజున గంగులవారిపాలెం రోడ్డులోని శ్రమదాన సంగతులు!

         వేకువ 4:16 నిమిషాలకు మొదటి ఫోటో లో ఉన్న 11 మంది కార్యకర్తలతో మొదలైన స్వచ్చ సేవ కాలక్రమేణా 29 మందికి చేరింది.

         నేటి కార్యక్రమంలో ట్రాక్టర్ లో ఉన్న నచ్చిన పనిముట్లు తీసుకుని గంగులవారిపాలెం రోడ్డులో గతంలో పెట్టిన మామిడి మొక్కల మొదళ్ళ వద్ద పెరుకుపోయిన పిచ్చి గడ్డిని, తుక్కును చేతులతో లాగి మొదళ్ళ వద్ద చెట్టు చుట్టూ శుభ్రం చేశారు.

         ఒక కార్యకర్త రోడ్డుకు అంచున ఎత్తుగా పెరిగిన గడ్డిని మిషన్ సహాయంతో కత్తిరించడం జరిగింది.  

         కొందరు కార్యకర్తలు మురుగు కాల్వకు - రోడ్డుకు మధ్యన ఉన్న మట్టి కాల్వలోకి కొట్టుకుపోకుండా ఉండడానికి దన్నుగా నరికెసిన చెట్ల కొమ్మలను, చెత్తను ఒక క్రమపద్ధతిలో వేశారు.

         ముగ్గురు కార్యకర్తలు డ్రైనేజి లో ఉన్న నీరు సరిగ్గా పారక చెత్తతో అడ్డుపడిపోతే ఆ డ్రైన్ కి దారిని చూపించారు.

         మహిళా కార్యకర్తలంతా తారు రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెత్తను చీపుళ్లతో శుభ్రం చేశారు.

         6 గంటల తర్వాత విజిల్ మ్రోగగానే కాఫీ సేవించిన తర్వాత సమీక్షా సమావేశంలో పాల్గొని వేముల శ్రీను గారి చెప్పిన నినాదాలకు బదులిచ్చి,

         రేపటి కార్యక్రమ ప్రదేశం ఈరోజు ఆగిన చోట వద్ద నుండే అని తెలుసుకుని గృహోన్ముఖులయ్యారు.

- దాసరి రామకృష్ణ ప్రసాదు

   30.07.2025.

 

అంకితులుగా మిగులగలమా!

“మతములన్నియు మాసిపోవును - జ్ఞాన మొక్కటె నిలిచి వెలుగును”

అని గదా గురజాడ స్వప్నము, అద్భుతావహమైన జోస్యము?

చల్లపల్లొక ఉదాహరణగ స్వచ్ఛ శుభ్రత రాజ్యమేలును”

అని మనం ఋజుపరచగలమా - అంకితులుగా మిగులగలమా!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   లాస్ ఏంజల్స్ - USA

   30.07.2025