పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు ఇంకెంత కాలం వాడదాం?
09.08.2025 శనివారం - 3555* వ రోజు నాటి శ్రమదాన సన్నివేశములు!
తెల్లవారు జాము 4:14 నిమిషాలకు గంగులవారిపాలెం రోడ్ లోని సన్ ఫ్లవర్ స్పెండర్ సిటి క్రాస్ రోడ్ వద్ద 15 మంది కార్యకర్తలు మొదటి ఫోటో దిగి పని ప్రారంభించారు. ఒక బృందం అల్స్టోనియా మొదళ్ళను కట్ చేసి పొడవు తగ్గించడం, కొందరు కత్తులతోనే పెరిగిన రోడ్ మార్జిన్ లోని గడ్డిని సమానంగా కత్తిరించడం లాంటి పనులు మొదలు పెట్టి విశ్రమించకుండా చేస్తూ ఉన్నారు.
ఒక కార్యకర్త ఈ దారిలోనే గతంలో మిగిలిన పని కలుపు, గడ్డి రోడ్డు మార్జిన్ లో ఉన్న భాగాన్ని గడ్డి కోసే యంత్రంతో ట్రిమ్ చేయడంతో ఆ భాగం కూడా అందంగా తయారయింది.
కొందరు మిషన్ రంపంతో రోడ్డుకు దిగువ భాగాన ఎత్తుగా పెరిగి అడ్డుగా ఉన్న కోనో కార్పస్ చెట్టును కట్ చెయ్యటం జరిగింది. మరి కొంతమంది ఎగుడు దిగుడుగా ఉన్న కొమ్మలను కత్తిరించగా మహిళా కార్యకర్తలు వాటిని ఖాళీ ప్రదేశానికి షెడ్డర్ లో వేసే నిమిత్తం చేర్చారు.
తదుపరి మహిళా కార్యకర్తలు పని చేసిన భాగాన్ని అంతా శుభ్రంగా ఊడ్చి గడ్డి పోగులను ట్రాక్టర్ లో లోడ్ చేశారు.
216 జాతీయ రహదారి నుండి చల్లపల్లిలోకి ప్రవేశించే 5-6 సర్వీస్ రోడ్లు ఉన్నప్పటికీ “చల్లపల్లి నుండి జాతీయ రహదారికి వెళ్ళాలన్నా హైవే నుండి చల్లపల్లికి రావాలన్నా అందరికీ నచ్చే ప్రతి ఒక్కరూ మెచ్చే ఊరికి అందాన్నిచ్చే సుందరమైన రహదారి ఈ ఆసుపత్రి దారి అన్నమాట జగమెరిగిన సత్యం”
ఈ రోజు 30 మందికి పైగా కార్యకర్తలు పనిచేసిన ఈ దారిలో 6 గంటల వరకు శ్రమించి విజిల్ మ్రోగగానే పనికి విరామమిచ్చి కాఫీ సేవించిన పిదప సమీక్షలో ‘భరత్’ పలికిన “జై స్వచ్చ సుందర చల్లపల్లి” కి జై కొట్టి,
గురవయ్య మాస్టారి సుభాషితాలు విని ,
రేపు కలువవలసిన ప్రదేశం ఈ స్పెండర్ సిటి క్రాస్ రోడ్ వద్ద అనుకుని నిష్క్రమించారు.
- నందేటి శ్రీనివాస్
ప్రజా కళాకారుడు
09.08.2025.
కశ్మలాల పైకి ఉరుకు చిరుత
ఈ కార్యకర్త ఊరి కశ్మలాల పైకి ఉరుకు చిరుత
పర్యావరణ భద్రత పాటించు ఈ కార్యకర్త
తనతో బాటితరులనూ స్వస్తపరచు యుగకర్త
తనఊరును, పరిసరాల్ని ధన్యపరచు కార్యకర్త!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
లాస్ ఏంజల్స్ - USA
09.08.2025