3566* వ రోజు ....

 ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం!

3566* - 21.08.2025 వ నాటి కార్యక్రమ శ్రమ విశేషాలు!

          నేడు జాతీయ రహదారిపై స్వాగత ద్వారమునకు కుడి వైపున రోడ్డుకు అవతలి వైపు శ్రమించిన కార్యకర్తలు మొత్తంగా కలిపి 25 మంది.

          రోడ్డుకు దిగువ భాగాన చేతులతో, కత్తులతో, పంజాలతో గతంలో నాటిన మొక్కల చూట్టూ చిత్తుచిత్తుగా పెరిగిన పిచ్చి గడ్డిని, కలుపును పీకి గుట్టలుగా పోగేసారు.

          నలుగురు కార్యకర్తలు హైవేలో బండ్రేవు కోడు వద్ద నుండి క్లబ్ రోడ్డు వరకు గతంలో పెట్టిన మొక్కలకు దన్నుగా మట్టిని పోసారు.  

          5:30 సమయంలో కొంతమంది కార్యకర్తలు ఒక ట్రాక్టర్ చెత్తను లోడింగ్ చేసి కాసానగరం జంక్షన్ వద్ద రోడ్డు పల్లంలో పోశారు.  

          కార్యక్రమ ముగింపు సమావేశంలో “BSNL నరసింహారావు” బిగ్గరగా పలికి కార్యకర్తలచే పలికించిన నినాదాలకు బదులిచ్చి,

          రేపటి కార్యక్రమం కూడా ఇదే 216 జాతీయ రహదారిలోని ఈరోజు ముగింపు వద్ద నుండి అని తెలుసుకుని గృహోన్ముఖులయ్యారు.       

- దాసరి రామకృష్ణ ప్రసాదు

  20.08.2025.

 

కార్యకర్తలందించిన కానుక

పుష్పించిన ఆమొక్కలు, నీడ పంచుచున్న చెట్లు,

గడ్డి, పిచ్చి మొక్కలేని కమనీయత, రమణీయత

సౌందర్యారాధకులకు - స్వచ్ఛ శుభ్ర ప్రేమికులకు

కార్యకర్తలందించిన కానుక పాగోలు బాట!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   20.08.2025.