3580* వ రోజు ....
ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం!
3580* నాటి స్వచ్ఛ శ్రమ సంగతులు!
నేటి ఉదయం 4:14 నిమిషాలకు హైవే లో “శారదా గ్రాండియర్” కి అతి దగ్గరలో 8 మంది కార్యకర్తలతో మొదలైన శ్రమదాన ఉద్యమం కార్యక్రమం ముగింపు సమయానికి 23 మందితో ఒక సమూహంగా మారింది.
నేటి కార్యక్రమంలో భాగంగా
1. నలుగురు కార్యకర్తలు చల్లపల్లికి ముఖ్యమైన ప్రజలను ఆకర్షించే విధంగా ఉన్న ‘స్వాగత ద్వారం” వద్ద మరింత మెరుగులు దిద్దడానికి “బోగన్ విలియా” మొక్కలను తాడు సహాయంతో ఒక క్రమపద్ధతిలో కట్ చేశారు.
2. హైవే కి పొలానికి మధ్య గతంలో పెట్టిన పూల మొక్కల వద్ద ఏపుగా పెరిగిన గడ్డిని, పిచ్చి తీగను కుదుళ్లతో లాగి పల్లపు ప్రాంతంలో వేశారు.
3. ఒక కార్యకర్త మిషన్ సహయంతో రోడ్డు మార్జిన్లలో ఉన్న గడ్డిని కత్తిరించారు.
4. మరొక కార్యకర్త రోడ్డు ప్రక్కల తాగి పడేసిన మద్యం సీసాలను, ఖాళీ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ను, ప్లాస్టిక్ గ్లాసులను ఏరి ఒక గోనె సంచిలో పోగేశారు.
ఇలా నేటి కార్యక్రమాన్ని విసుగూ, విరామం లేకుండా పట్టుదలతో చేస్తున్న కార్యకర్తలకు 6 గంటలకు విజిల్ మ్రోగగానే ఈరోజు కార్యక్రమానికి ముగింపు పలికి, కాఫీ సేవించి,
అడపా గురవయ్య గారు పలికించిన నినాదాలు పలికి,
రేపటి కార్యక్రమం కోసం “శారదా గ్రాండియర్” వద్ద కలుసుకుందామని గృహోన్ముఖులయ్యారు.
- దాసరి రామకృష్ణ ప్రసాదు.
03.09.2025.
చల్లపల్లిలో ‘స-రి-గ-మ-ప-ద-ని-స’ – 13
తగిరిశ-సీతారామరాజులూ, ధనలక్ష్మీ-కడియాల భారతి
ట్రస్టు కార్మికులు-బీ.డీ.6 లు, వేలుపూరి లక్ష్మీ-కృష్ణాదులు
ఖానులు-ద్రోణలు కర్మిష్టులుగా గ్రామసేవలో పాల్గొన్నందున
స్వచ్ఛ సుందరోద్యమ సంగీతము శ్రవణానందమొనర్చెనింతగా!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
03.09.2025.