పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం!
18.09.2025 గురువారం 3595* వ రోజు నాటి స్వచ్ఛ సేవా కార్యక్రమాలు.
జాతీయ రహదారిపై తెల్లవారుజాము 4:15 నిమిషాలకు ఈరోజు శ్రమదాన కార్యక్రమం మొదలైంది. హైవే రోడ్ ప్రక్కనే అనగా రహదారికి ఎడమ వైపు (అవనిగడ్డ వైపు) న దట్టంగా పెరిగిన రెల్లు గడ్డిని, పిచ్చి మొక్కలను పూర్తిగా నిర్మూలించే పనిలో మొదలకంటూ కొట్టడం జరిగింది.
కోసిన రెల్లుగడ్డిని, పిచ్చి మొక్కల చెత్తను మహిళా కార్యకర్తలు పై అంచున గుట్టలుగా పేర్చారు. కొద్దిమంది కార్యకర్తలు అక్కడక్కడా ఉన్న చెత్త గుట్టలను ట్రాక్టర్ లో లోడ్ చెయ్యడం జరిగింది.
ముగ్గురు కార్యకర్తలు స్వాగత ద్వారం సమీపంలో కొన్ని సువర్ణ గన్నేరు మొక్కలకు కంప కట్టడం, కర్రపాతడం చేశారు.
రోడ్ మార్జిన్ ను గడ్డి కటింగ్ మిషన్ తో సమానంగా కట్ చెయ్యడం జరిగింది.
6 గంటల వరకూ శ్రమించిన కార్యకర్తలు విజిల్ మ్రోగగానే పని విరమించి కాఫీ సేవించిన పిదప సమీక్షలో పాల్గొన్నారు. ‘తూము వెంకటేశ్వరరావు’ గారు పలికిన “జై స్వచ్ఛ సుందర చల్లపల్లి” కి జై కొట్టి,
రేపు కలవవలసిన ప్రాంతం ఈ “శారదా గ్రాండియర్” వద్ద అనుకుని నిష్క్రమించారు.
- నందేటి శ్రీనివాస్
ప్రజా కళాకారుడు
18.09.2025.
ప్రశ్నల పరంపర – 14
అడిగిచూస్తిని యౌవ్వనస్తుల - నడిగితిని విద్యార్ధి మిత్రుల –
రాజకీయుల – పాలకులు - నా గ్రామ పెద్దలు కొంతమందిని!
అందరొకటే సమాధానం – “ఔను మీకృషి మహాద్భుతమే
మాకు కుదరక రాక పోవుట మాత్రమెంతో దురదృష్టమె!”
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త
18.09.2025.