నా సంతోషం నాదండీ! - కాకి శివపార్వతి....           13-Oct-2024

దశ వసంతాల శ్రమ జీవుల మనో గతాలు – 4

నా సంతోషం నాదండీ!

          బజార్లు బాగుచేసే పనుల్లోకి కొత్తగా వచ్చిన శివపార్వతి నండి - మూడేళ్ల నుండి నేను గూడ ఊరికి పనికొచ్చే పనేదైనా చేయాలని ఎన్నిసార్లు అనుకొన్నానో, మాదసలు వక్కలగడ్డండి. చిల్లల వాగు వంతెన దగ్గర అదేంటో చీకటితోనే చాల మంది చెత్తా చెదారాలు ఊడిచి, ఏరి, బాగుచేస్తుంటే నాలుగు సార్లు చూశాను శార్!

          అంతమంది పెద్ద పెద్దోళ్ళు చీపుళ్ళు పట్టుకొని, కొడవళ్లు వాడుతూ చల్లపల్లి కోసం పనులు చేస్తుంటే - నాకూ వాళ్లలో కలిసి ఏదొక పని ఎందుకు చేయకూడదనిపించింది శార్!

          ఇక అప్పుడు బయ్యం కూడ పట్టుకొన్నది – “అమ్మో! అంత పెద్ద డాక్టర్లూ డాక్టరమ్మలు, మాస్టర్లూ మధ్యన ఐదో తరగతి చదవిన నేనెట్లా పనులు చేసేది?” అని!

          చల్లపల్లి పడమటి వీధిలో స్త్రీల వస్తువులమ్మే షాపు నడపడమూ, ఇంటి పనులూ కాదు నన్ను మూడేళ్లు ఆపింది అంత పెద్దోళ్లు  నన్ను ఏమనుకొంటారో అనే బెరుకే అడ్డం పడింది శార్!

          చివరికెట్టాగైతేనేం సెప్టెంబరు 18 న ధైర్ణం   చేశాను. అసలు మొదటి రోజే కార్యకర్తలందరూ ఎంత ఇదిగా మాట్లాడారో ప్రోత్సహించారో దాంతో నా బెంగంతా తీరిపోయింనుకోండి!

          ఆసల్నాకు తెలీకడగుతాను ఇంత పెద్దూళ్ళో ఈ 40-50 మందే నాండి ఇంకా చాల మంది ఈ పనుల్లోకి

వచ్చి ఈళ్ళ లాగే ఊరి మంచికి గంట సేపు పాటుబడకూడదాండి? అంత మాత్రానా మన కాండలన్నీ కరిగిపోతాయాండి?  

          నేను కూడ 26 రోజుల్నుండి స్వచ్ఛ కార్యకర్తగా గుర్తింపు తెచ్చుకోవడం తలుచుకొంటేనే - పట్టలేని సంతోషం శార్!

          నాకు ఇప్పుడు 2 అదృష్టాలండి - నేను కూడ పెద్ద పెద్దోళ్లతో కలిసి, ఊరి కోసం పనిచేయగల్గడమొకటీ,

సదువూ - సందేలేకపోయినా ఎంతో కొంత చల్లపల్లికి పనికొస్తున్నాననేది రెండోదీ!

          అసలు ఈపున్నెమంతా - ఈ అదృస్టమంతా విజయ్ శార్ దండి. నా బయ్యాలు పోగొట్టి, నన్ను దీంట్లోకి లాక్కొచ్చింది ఆశారేగదండి!

          ఇంకోటి గూడా ఉందండి నేను రాస్తే ఎన్ని తప్పులొస్తాయో అని, చెప్పి రామారావు శార్ తో రాయించాను తప్పులుంటే ఏమనుకోవద్దండి!

     ఇట్లు,

కాకి శివపార్వతి

క్రొత్త కార్యకర్త

13.10.2024.