చల్లపల్లి హిందూ శ్మశానవాటికకు 10 లక్షల విరాళ వాగ్దానం నెరవేర్చిన దాత.
గతంలో చల్లపల్లి హిందూ శ్మశాన వాటికకు 10 లక్షల భూరి విరాళం ప్రకటించి, మొదటి దఫా 5 లక్షలు ఇచ్చిన గ్రామ ప్రముఖుడు శ్రీ సజ్జా చలపతిరావు (S/o కోటయ్య) గారు అంతకుముందు వలెనే మండలి బుద్ధ ప్రసాదు గారి, గ్రామ సర్పంచ్ గారి సమక్షంలో మిగిలిన 5 లక్షల వాగ్దానాన్ని నిన్న నెరవేర్చుకున్నారు.
ఇంతటి మహాదాతలుంటే చల్లపల్లి స్వచ్ఛ సుందర - ఆనంద - ఆరోగ్య చల్లపల్లిగా మారక ఏం చేస్తుంది?
- దాసరి రామకృష్ణ ప్రసాదు
20.10.2024