పర్యావరణహితంగా జరిగిన CPM పార్టీ వారి జిల్లా మహాసభలు....           23-Dec-2024

పర్యావరణహితంగా జరిగిన CPM పార్టీ వారి కృష్ణాజిల్లా మహాసభలు

          చల్లపల్లిలో డిసెంబర్ 15, 16, 17 వ తేదీలలో CPM పార్టీ కృష్ణాజిల్లా మహాసభలు జరిగాయి.

          స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తల అభ్యర్ధన మేరకు ఈ మూడు రోజుల సభలలో ఎక్కడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులనేవి వాడకపోవడం స్వచ్ఛ కార్యకర్తలకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది.

             పట్టణంలో అక్కడక్కడా పెట్టిన బ్యానర్లు, తోరణాలు గానీ, స్టేజి వెనుక కట్టిన బ్యానర్, ర్యాలీలో ఉపయోగించిన జెండాలు గానీ - అన్నీ గుడ్డతో చేసినవే! గ్రామంలో ఎక్కడా ఫ్లెక్సీలు పెట్టలేదు.

          భోజనాల సమయంలో కూడా స్టీలు గ్లాసులు, మళ్లీ మళ్లీ వాడే ప్లేట్లనే ఉపయోగించడం పర్యావరణం పట్ల వాళ్ళ శ్రద్ధకు నిదర్శనం.  

          ఇక ముందు అన్ని పార్టీల వారు సొంతంగా ఇలాంటి నిర్ణయం తీసుకుని ఫ్లెక్సీలు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు వాడకుండా తమ కార్యక్రమాలను నిర్వహించుకుంటే మిగిలిన గ్రామలకు మన చల్లపల్లి ఆదర్శవంతంగా ఉంటుంది. 

- డా. డి.ఆర్.కె. ప్రసాదు

   చల్లపల్లి

   23.12.2024