ఎంత కష్టమొ! ఎంత ఇష్టమొ!
బ్రహ్మకాలములోనే మేల్కొని
ఊరి బాధ్యత మోసుకొంటూ
శ్మశానాల్లో సంచరిస్తూ
మురుగు కాల్వలు సంస్కర్తిస్తూ
పేడ పెంటలు ఊడ్చి ఎత్తే –
వేనవెలుగ చెట్లు పెంచే
స్వచ్చ - సుందర కార్యకర్తలదెంత కష్టం! ఎంత కష్టం!
డెబ్బదెనుబది ఏళ్ళ వృద్ధులు
గడపదాటుచు మహిళలిందరు
చలీ - మంచును ధిక్కరిస్తూ
మట్టితట్టలు మోసుకెళుతూ
ఊరి కోసం చెమట చిందగ
ఒంటి బట్టకు దుమ్ములంటగ
పాటుబడు రమణీయ దృశ్యం
ప్రజలకెంత మహోపదేశం!
కార్యకర్తల కఠిన శ్రమలూ
స్వార్ధరహిత ప్రయత్నాలూ
ఈ కావ్యకర్తల ౼ కార్యకర్తల
ఈ శ్రమాన్విత దృశ్య కావ్యం
క్రమం తప్పక చూచి మెచ్చే
స్వచ్చ - సుందర వైద్య ప్రముఖల
కెంత ఇష్టం! ఎంత ఇష్టం!
-USA - కనెక్టికట్ నుండి నాదెళ్ల సురేష్
(ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త సహకారంతో)
25.01.2025