23.06.2025....           23-Jun-2025

      శ్రీశ్రీ పద్ధతిలో చెప్పాలంటే :

చల్లపల్లి శ్రమదానం ఒక మహత్తర కావ్యం

అసలిది కవిత్వం కాదు - వాస్తవ జీవితం!

సామాజిక వేత్తల స్వప్నం కాదు - ఆచరణలో ఋజువౌతున్న సత్యం!

చల్లపల్లి వీధుల్లో - మనుషుల్లో

మొలకెత్తజూస్తున్న సాత్విక సామాజిక విప్లవం!

గుర్తింపు సంక్షోభం (ఐడెంటిటీ క్రైసిస్) లో పడి

ప్రచారాల వెంట పరుగులు తీస్తున్న లోకంలో

స్వార్థం చెరసాలలో ముగుస్తున్నది నేటి జీవితం

ఎంత మాత్రమూ కాజాలదు మానవాళి ప్రగతి పథం!

(తరువాయి రేపు)