చల్లపల్లిలో వృక్ష విలాపం – 2
(చల్లపల్లి వృక్ష సంపద తరపున దాసరి వారి వేదనకు నల్లూరి వారి పద్య రూపం)
నరుల పుట్టుక కన్న ముందే పుట్టిపెరిగిన వృక్షజాతిమి
వానరులుగా మనుషులుండగ వాస యోగ్యములైనవారము
బ్రతుకులో అడుగడుగునా మీ అవసరాలను తీర్చినారము
జీవ జాతుల మనుగడకు మా ప్రాణవాయువెగదా మూలము ?