07.08.2025....           07-Aug-2025

 (కృష్ణశాస్త్రి శైలిలో ఐతే) – 3

స్వచ్ఛ సుందరోద్యమం ఒక అమృతగీతం

(మళ్ళీ నిన్నటి తరువాయి)

ఓ సమయ శ్రమ త్యాగశీలి!

నీకింకా అవసరమా – ఆర్భాటాలూ, అట్టహాసాలూ?

ప్రచార హోరులూ, పొగడ్తలూ- భుజ కీర్తులూ?

ఆగామి- ఆదర్శ సమాజ ఆవిష్కర్తవి!

శ్రమ, నిబద్ధత, అణుకువలతో నీవే సుమా

మా గ్రామ భవిష్య దాశాకిరణానివి!

ప్రశంసల నధిగమించి, కీర్తి కాంక్షల్ని దాటుకొని

స్థిత ప్రజ్ఞుడివౌతున్ననీవే సుమా- మానమ్మకానివి!

ఎడతెగక మా కోసం ‘అమృతం కురిస్తున్న రాత్రివి’!