09.08.2022....           09-Aug-2022

            శ్రమ సమన్విత బృందగానం

ఎందరెందరో కలిసి నడిచే – వీధి వీధిని శుభ్రపరిచే –

అన్ని వసతులు పెంచి వేసే - ఐకమత్యపు శక్తి చాటే –

ఉన్న ఊరిని మనోజ్ఞంగా - స్వస్త సుందర బంధురంగా

శ్రమ సమన్విత బృందగానం జరుపు దృశ్యం చూడలేమా!