20.01.2023....           20-Jan-2023

               ఓమహాత్మా! ఓ మహర్షీ!

నీవు నేర్పిన విద్యలేమిటి? నేడు జరిగే తంతు లేమిటి?

హరిత సంపద – స్వచ్చ శుభ్రత అందలం ఊరేగుతుంటే-

“అందమే ఆనంద” మను కవి అంతరంగం బోధపడితే –

కార్యకర్తలె కాక ప్రజలూ కలిసి మెలిసీ శ్రమిస్తుంటే –

ఊళ్లు నందనమైతే దేశం ఉన్నత స్థితి చేరుకోదా?

“ఓ మహర్షీ! ఏది స్పందన? ఓ మహాత్మా! ఎచట బాధ్యత!