26.08.2023....           26-Aug-2023

         తెలుసుకొనవా గ్రామసోదర?

కార్యకర్తలు ఉద్యమించక కాళ్లు ముడుచుక్కూరుచుంటే –

ఉన్నపళముగ ఊరి లోపల స్వచ్చ – శుభ్రత మాయమైతే?

అడుగడుగునా పరిఢవిల్లిన హరిత సంపదలుప్తమైతే?

ఉక్కమాటుగ గ్రామమంతా బోసిపోతే - మాసిపోతే?

ఎంత దుర్భర – మెంతచీదర - తెలుసుకొనవా గ్రామసోదర?