కస్తూరి విజయ్ - 1 ....           11-Oct-2024

  దశ వసంతాల శ్రమ జీవుల మనో గతాలు – 1

అత్యంత ఫలప్రదమూఅతి పవిత్రమూ - మా స్వచ్చ సుందరోద్యమం!

         ఇంకా చెప్పాలంటే ఇలాంటి  ఉద్యమం ప్రతి ఊరికీ అనివార్యమూఅవశ్యకమూ! కేవలం పంచాయతీఆరోగ్యపారిశుద్ధ్య వ్యవస్థలతోనే గ్రామ వీధుల పచ్చదనమూ, పరిశుభ్రతాఆహ్లాదమూ నిలబడతాయనుకోవడం వివేకం కాకపోవచ్చు!

         పంచాయతీల నాయకత్వమూఅధికార వ్యవస్థాస్వచ్ఛంద సంస్థలూప్రజల సహకారమూ తగుపాళ్ళలో కలిసొస్తేఅవి విసుగూ విరామమూ లేకుండా పని చేసుకుపోతుంటే – ఎన్ని అద్భుతాలు జరుగుతాయో స్వచ్ఛ - సుందర చల్లపల్లిని చూస్తే తెలిసిపోతుంది!

         ఐతే - అందుకు ఓర్పు కావాలిక్షణాల్లో ఊరి అస్తవ్యస్తతలు చక్కబడతాయనే ఆలోచన మానుకోవాలిసుదీర్ఘ శ్రమదాన ఉద్యమాన్ని నిర్వహించేసమన్వయపరచే నాయకత్వం కావాలి; ఒడుదొడుకుల్ని తట్టుకొనే స్థిరత్వం ఉండాలివివిధ రాజకీయ పక్షాలు - ఊరి పెద్దల ఆమోదాలూ లభించాలి! ఇవన్నీ ఉన్నందువల్లే చల్లపల్లి ఉద్యమ ప్రభావం గల్లీ నుండి ఢిల్లీ దాకా ప్రసరించింది!

         అసలు సొంతానికి కాకుండాఊరి మేలు కోసం కష్టించాలనుకొనే వందల కొద్దీ కార్యకర్తలుండడమే మావూరి ప్రత్యేకత. అలాంటి వందలాది స్వచ్ఛ కారకర్తల్లో నేనూ ఒకడినైనందుకు అందులేని సంతృప్తి నాది.

         తొలినాటి నుండీ - అంటే 12-11-2014 నుండీ శ్రమదానం చేస్తున్న అదృష్టవంతుడిని కాను!

         “ఎన్ని చోట్ల – ఎన్ని ప్రయత్నలు చూడలేదు - ఈ మంచి ఉద్యమం మాత్రం నెలకో - ఆర్నెల్లకో ఆగిపోయేదే గదా” అని చాల మందిలాగే నేనూ నిర్లక్ష్యం వహించాను. ఎప్పుడైతే వచ్చి కార్యకర్తలతో కలిసివీధి పనులు మొదలుపెట్టానో – అప్పుడు గానిఇది అల్లాటప్పా సంగతి కాదనీఊరంతా స్వచ్చ- శుభ్ర – సుందరమయ్యే దాకా ఆగేది కాదనీ అర్థమయిపోయింది!

         ఒక్కసారి తోటి గ్రామస్తులకు సేవా సౌభాగ్యం రుచి దొరకాక – తొమ్మిదేళ్లుగా ఈ శ్రమదానంలో భాగస్తుడినైపోయాను. కోవిడ్ కాలంలో అఫీషియల్ గా శ్రమదానం ఆగింది గాని, 10-12 మందిమి మాత్రం పోలీసులకు ఆహారమందిస్తూనో - కోవిడ్ శవాల నెత్తుతోనో - దిక్కులేని కూలీలకూబిచ్చగాళ్లకూ తిండి పెడుతూనో కొంత సంతృప్తి చెందాం!

         మన బందరు రీజియన్ లో కెల్లా అత్యధికంగా 71 సార్లు రక్తదానం చేసినప్పుడూ, ఈ వేకువ శ్రమదాతనైనప్పుడూ, ఫ్రెండ్లీ పోలీస్ పనులు చేస్తున్నపుడూ సంతోషం కలుగుతుంటుంది.  

- కస్తూరి విజయ్

   11.10.2024.