దశ వసంతాల శ్రమ జీవుల మనో గతాలు – 3
గౌరవనీయులైన స్వచ్ఛ సుందర చల్లపల్లి రధ సారధులకు, కార్యకర్తలకు మరియు పెద్దలకు హృదయ పూర్వక నమస్కారంలు నా పేరు లయన్ తగిరిశ సాంబశివరావు నేను సాయి నగర్ కాలనీ పద్మావతి గారి హాస్పిటల్ దగ్గర లొ ఉంటాను. నేను Srysp జూనియర్ కళాశాలలొ ఇంగ్లీష్ లెక్చరర్ గా మరియు ప్రిన్సిపాల్ గా పనిచేసి రిటైర్ అయ్యాను. డాక్టర్ గారు మరియు మేడం గారి ఆధ్వర్యంలో మా రోడ్ లొ జరిగిన బహిరంగ మల విసర్జన కార్యక్రమం లొ పాల్గొనటం జరిగింది. స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యక్రమం ప్రారంభం ఐన తరువాత నేను స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యక్రమం లొ పాల్గొనలేకపోతున్నాను అని బాధ పడేవాడిని దానికి కారణం నేను శారీరక వికలాంగుడను. కాని కొద్ది రోజుల తరువాత డాక్టర్ గారు స్వచ్ఛ సుందర చల్లపల్లికి సంబందించిన పాటలతో ఒక మైక్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు నుండి ఉదయం 5.30 గంటలకు ఆ మైక్ తో నా two వీలర్ పై గ్రామం లొ తిరుగుతూ ఉండటం చాలా సంతోషంగా ఉండేది. అలాగే నేను ప్రిన్సిపాల్ గా పనిచేసే కాలం లొ స్వచ్ఛ సుందర చల్లపల్లి సుందరీకరణ మా కళాశాల ప్రాంగణం నుండి ప్రారంభం కావడం మరియు స్వచ్ఛ సుందర చల్లపల్లి కి సంబందించిన కార్యక్రమంలు మా కళాశాలలొ జరగటం నాకు ఆనందం కలిగించే అంశాలు. నేను స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యక్రమంలలో పాల్గొనే అవకాశం డాక్టర్ DRK ప్రసాద్ గారికి, మేడం డాక్టర్ పద్మావతి గారికి మరియు స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్తలకు నా హృదయ పూర్వక నమస్కారంలు మరియు ధన్యవాదములు 🙏🙏🤝🤝❤❤
- తగిరిశ సాంబశివరావు
10.10.2024.