వర్తమానానికొక హామీ – ట్రస్టు భవితకొక గ్యారంటీ! - 18.11.2024....           19-Nov-2024

 వర్తమానానికొక హామీ – ట్రస్టు భవితకొక గ్యారంటీ!

          ఇదేదో సూటిగా ఒక దేశానికి సంబంధించిన స్టేట్ మెంటు కాదులెండి! దేశంలో, రాష్ట్రంలో, జిల్లాలో ఒక మూలనున్న మా చల్లపల్లి గురించి మాత్రమేననుకోండి!

ఆ ఊళ్లో ఒకటో – రెండో కాదు – ఏకంగా పదేళ్ళ నుండీ, రోజూ 30-40-50 మంది “మాకేంటి?” అని కాక – ‘మన ఊరికింకా ఏం చేయగలం’ - అని తపనపడుతూ శ్రమించడం గురించి స్వామి!

          సరే - వాళ్ళ శ్రమదానానికండగా డాక్టర్ల కుటుంబమొకటీ – ‘మనకోసం మనం’ అనే ట్రస్టొకటీ! MLA మండలి గారూ, గురవారెడ్డి గారూ దానికి బాధ్యులు! దాన్ని ప్రారంభించినపుడు పాతిక, 30 ఏళ్ళన్నా నిండని ఇద్దరు యువతీయువకులు సభ్యులయ్యారు! – దాసరి స్నేహ, దాసరి వరుణ్ లు!

          అందరూ పెద్ద వయస్సు సభ్యులే ఉన్న ఆ ట్రస్టుకు ఈ ఇద్దరే ముందుముందు గ్యారంటీ స్వామీ!

          స్నేహ దుబాయి, అమెరికాల్లో ఉంటూ – ఏ చిన్న అవకాశం దొరికినా స్వచ్చ కార్యకర్తలతో కలిసిపోయి శ్రమిస్తుంటుంది.

          డాక్టర్ వరుణ్ అటు విజయవాడ నాగార్జునలోనూ ఇటు చల్లపల్లి ఆస్పత్రిలోనూ గ్యాస్ట్రో ఎంటరాలిజిస్టుగా, లేపరోస్కోపిక్ సర్జన్ గా క్షణం తీరిక లేని వ్యక్తి! కాస్త రిజర్వ్ డ్ గానూ - గుంభవనగానూ ఉండే తత్త్వం! ఐతే - స్వచ్చ చల్లపల్లికి సేవలందించడంలో మాత్రం ఇద్దరిదీ ఏకాభిప్రాయం!

          ఈయన పిల్లలిద్దరూ 4 ఏళ్ల వయసులోనే కార్యకర్తలతో కలిసిపోయి, చీపుళ్లు పట్టి, స్వచ్చ సుందర నినాదాలు చేసి హల్ చల్ చేస్తున్నారు!

          వరుణ్ గారు గాని, ఆయన శ్రీమతి Dr దివ్య గారు గానీ - చల్లపల్లిలో ఉండక – బెజవాడలో ఉండి తక్కువగానే శ్రమదానంలో పాల్గొంటారు గానీ –

          ట్రస్టు కార్యక్రమ ఖర్చుల భారం మాత్రం మోస్తూనే ఉంటారు –

- కస్తూరి విజయ్.

   19.11.2024